మూడు సినిమాల్ని గట్టెక్కించిన ప్రభాస్‌

మూడు సినిమాల్ని గట్టెక్కించిన ప్రభాస్‌

ఆగస్ట్‌లో రద్దీ పెరిగిపోయిందని సెప్టెంబర్‌కి వాయిదా వేయాలని రణరంగం, ఎవరు నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అలా చేయడం వల్ల నెల రోజుల పాటు ఫైనాన్స్‌పై వడ్డీ భారం పడుతున్నా కానీ మంచి రిలీజ్‌ డేట్‌ చూసుకోవడం బెస్ట్‌ అని అలా డిసైడ్‌ అయ్యారు. తీరా సాహో ఆగస్ట్‌ 15నుంచి వాయిదా పడడంతో ఈ రెండు చిత్రాలకీ స్వీట్‌ తినిపించినట్టయింది. ఈ రెండిటినీ ఆగస్ట్‌ 15న విడుదల చేస్తున్నామని మెరుపు వేగంతో ప్రకటించేసారు. సాహో లేకపోవడం వల్ల స్వాతంత్య్ర దినోత్సవం లాంటి పబ్లిక్‌ హాలిడేని క్యాష్‌ చేసుకునే అవకాశం ఈ రెండు చిత్రాలకీ దక్కింది.

అదే విధంగా ఆగస్టు 9న వస్తోన్న 'మన్మథుడు 2'పై వున్న భారం కూడా తొలగిపోయింది. సాహోతో పోటీ దేనికని ఆ చిత్రం బయ్యర్లు తటపటాయిస్తూనే వున్నారు. సాహో రిలీజ్‌ అయితే ఈ చిత్రం థియేటర్లు కోల్పోతామని భయపడుతూ వచ్చారు. కానీ సాహో వాయిదా పడడం దీనికి పెద్ద బూస్ట్‌ అయింది. ముందుగా విడుదలై మంచి టాక్‌ రాబట్టుకుంటే తొలి వారంలో ఇండిపెండెన్స్‌ డే హాలిడేని బ్రహ్మాండంగా సొమ్ము చేసుకునే వీలు చిక్కుతుంది. ఒక్క సాహో తప్పుకోవడంతో మూడు సినిమాల జాతకం ఒక్కసారిగా మారిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English