పూజా హెగ్డే కంటే టబు హాట్‌!

పూజా హెగ్డే కంటే టబు హాట్‌!

సీనియర్‌ హీరోయిన్లతో కథలోని కీలక పాత్ర చేయించడం త్రివిక్రమ్‌కి అలవాటుగా మారింది. 'అత్తారింటికి దారేది'లో నదియాని, అజ్ఞాతవాసిలో కుష్బూని తిరిగి తీసుకొచ్చిన త్రివిక్రమ్‌ ఈసారి టబుతో ఒక కీలక పాత్రని అల్లు అర్జున్‌ సినిమాలో చేయిస్తున్నాడు. ఈ పాత్ర చేయడానికి టబు భారీ పారితోషికం డిమాండ్‌ చేసిందట. పూజా హెగ్డేకి ఇస్తోన్న పారితోషికం కంటే టబుకే ఎక్కువ పే చేస్తున్నారని తెలిసింది. బాలీవుడ్‌లో టబుకి ఇప్పుడు చాలా డిమాండ్‌ వుంది. ఆమె నటించిన అంధాదూన్‌, దే దే ప్యార్‌ దే హిట్టయ్యాయి. దీంతో టబుకి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.

వాటిని వదులుకుని తెలుగు సినిమాలో నటించాలంటే అందుకు తగ్గ నజరానా ఇవ్వాలని టబు డిమాండ్‌ చేసింది. ఈ పాత్రని ఆమెతోనే చేయించాలని ఫిక్స్‌ అయిపోయిన త్రివిక్రమ్‌ ఖర్చు పెరిగినా కానీ టబునే కావాలని చెప్పడంతో నిర్మాతలు చేసేదేమీ లేకపోయింది. తనకంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కి ఎక్కువ పారితోషికం అని తెలిస్తే పూజ ఈగో హర్ట్‌ అయి తనకీ ఎక్కువ కావాలని అడుగుతుందేమో అని సోషల్‌ మీడియాలో జోక్‌లు వేసుకుంటున్నారు. కొందరయితే ఈ న్యూస్‌ లింక్స్‌ పూజాకి షేర్‌ చేసి నీకంటే టబునే హాట్‌ అంటూ కవ్విస్తున్నారు కూడా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English