సాహో ఎనిమిది నిమిషాలు అదరహో!

సాహో ఎనిమిది నిమిషాలు అదరహో!

సాహో చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించారు. యాక్షన్‌ చిత్రాలలో తలమానికంగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ 'మిషన్‌ ఇంపాజిబుల్‌' చిత్రాల తరహాలో భారీ యాక్షన్‌ దృశ్యాలతో తీసారు. ఈ యాక్షన్‌ దృశ్యాలే సాహోని కేవలం వెండితెరపై మాత్రమే చూడాల్సిన చిత్రంగా నిలబెడతాయని మేకర్స్‌ విశ్వసిస్తున్నారు. ఈ చిత్రంలోని ఎనిమిది నిమిషాల ఛేజ్‌ సీక్వెన్స్‌ గురించి మాత్రం అంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్ల పర్యవేక్షణలో తీసిన ఈ దృశ్యానికి అచ్చంగా డెబ్బయ్‌ కోట్లు ఖర్చు పెట్టి కొన్ని నెలల పాటు చిత్రీకరించారు.

ఒక హై బడ్జెట్‌ సినిమాకి పారితోషికాలు లేకుండా అయ్యే ఖర్చుతో ఇది సమానమంటే ఎనిమిది నిమిషాలకి ఎంత చేసారో అర్థం చేసుకోవచ్చు. టీజర్‌లో కనిపించిన ఛేజ్‌ దృశ్యం బిట్స్‌ ఈ సీన్‌లోనివే. టీజర్‌లో షాట్స్‌కి ఇంకా పూర్తి స్థాయిలో విఎఫ్‌ఎక్స్‌ జరగలేదు. ఈ సన్నివేశం హాలీవుడ్‌ సినిమా చూసిన అనుభూతికి ఏమాత్రం తీసిపోకుండా వుండాలని విజువల్‌ ఎఫెక్ట్స్‌ని మరోసారి చేయిస్తున్నారు. ఈ సన్నివేశంతో టికెట్‌ డబ్బులు వసూలయిపోయిన భావన కలుగుతుందని, మిగతాదంతా బోనస్‌లా ఫీల్‌ అవుతారని ఈ చిత్రానికి పని చేసిన వారు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English