సరిలేరు నీకెవ్వరు నుంచి ఆయన వాకౌట్‌?

సరిలేరు నీకెవ్వరు నుంచి ఆయన వాకౌట్‌?

మహేష్‌తో అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌ మొదలయింది. ఈ చిత్రాన్ని నవంబర్‌ నెలాఖరుకి పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకుని ఫుల్‌ స్పీడ్‌తో పని చేస్తున్నారు. దీంతో పలువురు సహాయ నటుల బల్క్‌ డేట్స్‌ ఈ చిత్రానికి అవసరమవుతున్నాయి. ఇందులో ఒక కీలక పాత్ర చేయడానికి అంగీకరించిన జగపతిబాబు తన బిజీ షెడ్యూల్స్‌ వల్ల డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేకపోయాడట. ఆయనే కావాలని కూర్చుంటే పలువురు సహాయ నటులతో చిక్కొచ్చేలా వుందని వేరే ఆప్షన్ల కోసం చూస్తున్నారట. ఈ పాత్రని ప్రకాష్‌రాజ్‌ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ప్రకాష్‌రాజ్‌ ఇటీవల సినిమాలు తగ్గించినా కానీ మహేష్‌, దిల్‌ రాజు ఇద్దరితోను అతనికి సత్సంబంధాలున్నాయి. ప్రకాష్‌రాజ్‌ నిర్మాతలని ఏడిపిస్తాడనే పేరున్నా కానీ కొందరు నిర్మాతలు, హీరోలని మాత్రం అతను పెద్దగా ఇబ్బంది పెట్టడు. వారిలో మహేష్‌, రాజు వున్నారు కనుక ఆయన ఈ పాత్ర చేయడానికి స్కోప్‌ ఎక్కువే వుంది. ఇదిలావుంటే మహేష్‌ బర్త్‌డేకి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయడానికి డిసైడ్‌ చేసారు. మిలటరీ గెటప్‌లో వున్న స్టిల్‌ రిలీజ్‌ చేయాలా లేక మామూలు స్టిల్‌ అయితే బాగుంటుందా అనేది ఇంకా డిసైడ్‌ అవలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English