విజయ్‌ దేవరకొండ భయపడ్డట్టే అయింది

విజయ్‌ దేవరకొండ భయపడ్డట్టే అయింది

అన్నయ్య హీరో అయ్యాడనగానే అంతవరకు నటించాలనే ఆలోచన కూడా లేని తమ్మయ్యకి యాక్టింగ్‌ దుగ్ధ పుట్టడమనేది చాలా కుటుంబాలలో జరిగింది. అలా వచ్చిన వారిలో చాలా కొద్ది మంది తమ్ముళ్లు మాత్రమే క్లిక్‌ అయ్యారనుకోండి. మిగతా వాళ్ల కంటే కాస్త ప్రాక్టికల్‌గా వుండే విజయ్‌ దేవరకొండ తన తమ్ముడు హీరో అవ్వాలనుకుంటే దానికి ఎదురు చెప్పాడు. అమెరికాలో ఉద్యోగం వదులుకోవద్దని, ఆ ఉద్యోగం చేసుకుంటూనే సొంత నిర్మాణ సంస్థ పెట్టుకుందామని ఆనంద్‌కి నచ్చచెప్పాడు. కానీ అన్నయ్యలా తాను కూడా స్టార్‌ అయిపోతానని ఆనంద్‌ నమ్మాడు. అందుకే దొరసాని చిత్రంతో నటన మొదలు పెట్టాడు.

ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో నగ్నంగా కనిపించాడనే ఒక్క పాయింట్‌ తప్ప అతని గురించి చెప్పుకోడానికంటూ ఏమీ లేకపోయింది. మొదట్లో ఈ సినిమా ప్రచారానికి దూరంగా వున్నా కానీ ఫ్యామిలీ ఒత్తిళ్ల వల్ల విజయ్‌ దేవరకొండ దీనికి చివర్లో ప్రచారం చేసాడని గుసగుసలు వినిపించాయి. అయితే అతను ప్రచారం చేసినా ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. డిజాస్ట్రస్‌ కలక్షన్లతో అన్ని సెంటర్లలోను దొరసాని ఫ్లాపయింది. అంతే కాదు ఆనంద్‌ దేవరకొండ హీరో మెటీరియల్‌ కాదనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ పరాభవాన్ని ఊహించాడు కనుకే విజయ్‌ ఇదంతా వద్దని తమ్ముడికి చెప్పాడు. అయినా కానీ కొందరికి రోట్లో తల పెట్టి తెలుసుకునే వరకు తత్వం బోధపడదుగా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English