ఆ హీరో కెరీర్‌ని ఆమె నాశనం చేసింది!

ఆ హీరో కెరీర్‌ని ఆమె నాశనం చేసింది!

క్రిష్‌ 3, బ్యాంగ్‌ బ్యాంగ్‌ టైమ్‌లో హృతిక్‌ రోషన్‌కి సల్మాన్‌, షారుక్‌, అమీర్‌లతో సమానమైన మార్కెట్‌ వుండేది. వాళ్ల చిత్రాలతో పోటీగా అతని సినిమాలు కూడా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్‌ తెచ్చుకునేవి. అయితే ఇటీవల హృతిక్‌ మార్కెట్‌ దారుణంగా పడిపోయింది. యాక్షన్‌ సినిమాలు విడిచిపెట్టి ప్రయోగాలు మొదలు పెట్టడం ఒక కారణం అనుకుంటే... కంగనా రనౌత్‌ అతనికి చేసిన వ్యక్తిగత డ్యామేజ్‌ అసలు కారణమని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ తనని మోసం చేసాడనేది కంగన బలంగా ప్రచారం చేసుకోగా, హృతిక్‌ దానిని సరిగ్గా డిఫెండ్‌ చేసుకోలేకపోయాడు.

పైగా భార్యతో విడాకులు తీసుకోవడం వల్ల కంగన ఆరోపణలకి బలం చేకూరింది. కంగన ఎంత కన్విన్సింగ్‌గా ఆరోపణలు చేస్తుందో, ఎంతగా వ్యక్తిత్వ హననం చేస్తుందో ఇప్పటికీ చూస్తూనే వున్నాం. అయితే హృతిక్‌ విషయంలో అతడిని సమర్ధించే వాళ్లతో పాటు కంగన మాటలని నమ్మిన వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే వున్నారు. సరిగ్గా అదే సమయంలో హృతిక్‌ తన ప్రధాన బలమైన యాక్షన్‌ సినిమాలు విడిచిపెట్టి ప్రయోగాలకి దిగడంతో అతని మార్కెట్‌ అడుగంటిపోయింది. ఇప్పటికీ కంగన, ఆమె సోదరి హృతిక్‌ని వెంటాడుతూనే వున్నారు. ఇటీవల హృతిక్‌ సోదరి వంక చూపెట్టి అతడిని బూచిగా చూపించేందుకు గట్టిగా కృషి చేసారు. ఇలాంటి ఎటాక్‌ని దాటుకుని మళ్లీ హృతిక్‌ మునుపటి రేంజ్‌కి చేరుకోవాలంటే ప్రయోగాత్మక చిత్రాలు బెస్ట్‌ ఆప్షన్‌ కాదు. మరి టైగర్‌తో కలిసి చేస్తోన్న 'వార్‌' అయినా హృతిక్‌ని పతనావస్థ నుంచి పైకి లేపుతుందో లేదో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English