పిల్ల హీరోలని బెదరగొడుతోన్న రష్మిక

పిల్ల హీరోలని బెదరగొడుతోన్న రష్మిక

రష్మిక నేటి తరానికి కావాల్సిన బోల్డ్‌ చిత్రాలని ఏమాత్రం జంకు లేకుండా చేసేస్తుంది. డియర్‌ కామ్రేడ్‌లో ఆమె ఇంగ్లీష్‌ ముద్దులు పెట్టడానికి కూడా వెనకాడలేదంటేనే ఆమె ఈ తరానికి ప్రతినిధి అనేది స్పష్టమవుతోంది. ఇక మహేష్‌తో 'సరిలేరు నీకెవ్వరు' చేస్తోంది కనుక రష్మికకి ఇప్పుడు ప్రమోషన్‌ వచ్చింది.

ఇకపై ఆమె వరుసగా భారీ సినిమాల్లోనే కనిపిస్తుంది. త్వరలోనే అల్లు అర్జున్‌తో కూడా ఆమె నటించనుంది. నిన్న మొన్నటి వరకు చిన్న హీరోయిన్‌ అయిన రష్మిక ఇప్పుడు కాబోయే సూపర్‌స్టార్‌. దీంతో తన రేంజ్‌ మెయింటైన్‌ చేయడానికి చిన్న సినిమాలకి ఒక రేటు ఫిక్స్‌ చేసింది. పెద్ద హీరోలతో సినిమాలకి ఫ్లెక్సిబుల్‌ రేట్స్‌ ఓకే అంటున్నా కానీ మీడియం రేంజ్‌ హీరోలతో మాత్రం రష్మిక ఇక తక్కువకి చేసేది లేదంటోంది.

ముఖ్యంగా ఇతర భాషలలో హీరోయిన్లకి తక్కువ పే చేస్తుంటారు. తెలుగు సినిమాల్లో వుండే పారితోషికం తమిళం, కన్నడ చిత్రాల్లో రావు. కానీ రష్మికకి అక్కడ కూడా డిమాండ్‌ బాగా వుంది. దాంతో అక్కడి మార్కెట్‌ రేట్‌కి డబుల్‌ అడుగుతూ 'డేట్స్‌ కావాలంటే అందుకు ఒప్పుకోండ'ని నిర్మొహమాటంగా చెప్తోంది. రెమ్యూనరేషన్‌ పెంచేసావట అని మీడియా అడిగితే 'అందులో తప్పేముంది? మీరు మాత్రం ఇన్‌సెంటివ్స్‌ అడగరా' అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English