ఆర్‌.ఆర్‌.ఆర్‌. చాలు... చరణ్‌ సంచలన నిర్ణయం

ఆర్‌.ఆర్‌.ఆర్‌. చాలు... చరణ్‌ సంచలన నిర్ణయం

రామ్‌ చరణ్‌కి ఒకే సినిమాపై ఏళ్ల తరబడి పని చేయడం ఇష్టముండదు. గతంలో మగధీర చిత్రానికి ఎక్కువ సమయం పడుతోందని అసహనానికి గురయ్యాడు. గ్యాప్‌ ఎక్కువ వచ్చినందుకు అభిమానులకి సారీ కూడా చెప్పాడు. మగధీర అంతటి ఘన విజయం సాధించినా కానీ చాలా కాలం అలాంటి చిత్రం జోలికి పోలేదు. మళ్లీ రాజమౌళితోనే 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రం చేస్తున్నాడు. దీనికి చరణ్‌ ఏడాదిన్నర సమయం కేటాయించాడు. దీని తర్వాత తన మార్కెట్‌ పెరిగినా కానీ మళ్లీ ఆ తరహా భారీ ప్రాజెక్టులు ఇప్పట్లో చేయనని అంటున్నాడు. ఒక్కో సినిమాకీ రెండేసి సంవత్సరాలు తీసుకుంటే అభిమానులకి ఎదురు చూపులు మిగల్చడమే కాకుండా టాలీవుడ్‌ మార్కెట్‌కి కూడా అన్యాయం చేసినట్టు అవుతుందని చరణ్‌ భావిస్తున్నాడు.

కనీసం ఏడాదికి ఒకటయినా తన సినిమా రావాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకే ఇప్పట్లో మళ్లీ భారీ చిత్రమేదీ చేయకూడదని చరణ్‌ డిసైడ్‌ అయ్యాడు. అయిదారేళ్ల తర్వాత మళ్లీ ఏదైనా భారీ చిత్రం చేస్తాడట కానీ ఆర్‌.ఆర్‌.ఆర్‌. తర్వాత మాత్రం ఏడెనిమిది నెలలలో పూర్తయ్యే సినిమాలు మాత్రమే టేకప్‌ చేస్తాడట. ఇతర భాషలలో విడుదల చేసే ఆలోచన వున్నా కానీ వాటి కోసం ఏళ్ల తరబడి సమయం ఇవ్వడమయితే కుదరదని చరణ్‌ చెప్పేస్తున్నాడు. చిరంజీవి స్లో అయిపోయిన తర్వాత, పవన్‌ సినిమాలు మానేసిన తర్వాత చరణ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా గుడ్‌ అనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English