హిట్‌ అని చెప్పుకుంటే యూజ్‌ ఏంటి?

 హిట్‌ అని చెప్పుకుంటే యూజ్‌ ఏంటి?

'నిను వీడని నీడను నేనే' చిత్రం తాను నటించిన గత రెండు చిత్రాల కంటే ఆరు రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించిందని నిర్మాత సందీప్‌ కిషన్‌ ప్రెస్‌కి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అతని గత రెండు చిత్రాలు ఏమిటనేది గూగుల్‌ చేయకుండా చెప్పడమే కష్టం.

అలాంటిది ఆ చిత్రాల వసూళ్లకి ఆరు రెట్లు వచ్చిందంటే అందులో గొప్పతనమేంటి? హారర్‌ చిత్రాలకి మామూలుగానే మిగతా సినిమాలకంటే బెటర్‌ అటెన్షన్‌ లభిస్తూ వుంటుంది. ప్రోమోలు ఆకర్షణీయంగా వున్నాయి కనుక ఈమాత్రం స్పందన రావడంలో వింత లేదనే చెప్పాలి. అయితే ఈ చిత్రాన్ని హిట్‌ అని ప్రొజెక్ట్‌ చేసుకోవాలనే తపన సందీప్‌లో ఎక్కువ కనిపిస్తోంది. అతనికిది లాభసాటి ప్రాజెక్ట్‌ అయి వుండొచ్చు.

నిర్మాతగా తొలి సినిమాతో కాసిని లాభాలు వస్తుండవచ్చు. కానీ నటుడిగా అతడిని ఈ చిత్రం ఎక్కడికి తీసుకెళ్తుంది. రాబోయే తన సినిమాలకి ఇది ఎంతవరకు హెల్ప్‌ అవుతుంది? ఈ చిత్రం చూసిన వారెవరూ సందీప్‌ కిషన్‌ అభినయం గురించి మాట్లాడడం లేదు. లేదా బ్లాక్‌బస్టర్‌ అయిపోయే ఛాన్స్‌ అయితే అస్సలు లేదు. హిట్లు లేవంటున్నారు కనుక హిట్‌ సినిమా తీసాననే సెల్ఫ్‌ శాటిస్‌ఫాక్షన్‌ని సందీప్‌ కోరుకుంటున్నాడా?

నిజంగా అతను పాత్‌ బ్రేకింగ్‌ సినిమా తీయాలనుకుంటే ఈమాత్రం ఎఫర్ట్స్‌ చాలవు. నటుడిగా తనని ఛాలెంజ్‌ చేసే పాత్రలు ఎంచుకుని తన సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేయాలి తప్ప ఈ విధమయిన ప్రొజెక్షన్‌ వల్ల ఒరిగేదేమీ వుండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English