సంగీత దర్శకులతో ఈ పేచీ ఏంటి?

సంగీత దర్శకులతో ఈ పేచీ ఏంటి?

రెండు పెద్ద సినిమాలు.  రెండూ భారీ బడ్జెట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నవే. రెంటి మీదా అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తెలుగు సినిమాకు తలమానికం అవుతాయని భావిస్తున్న రెండు సినిమాలకూ సంగీత దర్శకులతో పేచీ తప్పలేదు. షూటింగ్ పూర్తయి.. విడుదలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో కూడా మ్యూజిక్ విషయంలో ఒక క్లారిటీ లేక ఈ రెండు సినిమాల మేకర్స్ అయోమయ స్థితిని ఎదుర్కోవడం ఆశ్చర్యకరమే. ఆ రెండు చిత్రాలు ‘సాహో’, ‘సైరా’ అని ఈపాటికే అర్థమై ఉంటుంది.

‘సాహో’ సినిమా మ్యూజిక్ విషయంలో ఎంత సస్పెన్స్ నడిచిందో తెలిసిందే. ముందు ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా ఎంపికైంది శంకర్-ఎహసాన్-లాయ్. కానీ సినిమా మొదలైన ఏడాది తర్వాత వాళ్లు ముగ్గురూ తప్పుకున్నారు. మధ్యలో రెండు మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తే ఒకదానికి తమన్, ఇంకోదానికి జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేశారు. టీజర్ రిలీజయ్యే సమయానికి శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకోవడంతో జిబ్రాన్‌తోనే పని చేయించుకున్నారు. తర్వాత అతనే సినిమాకు కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తాడని వెల్లడించారు. పాటల సంగతేంటి అనుకుంటుంటే.. దీనిపై చాలా సస్పెన్స్ నడిచింది. చివరికి ఒక్కో పాట ఒక్కొక్కరితో చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇక ‘సైరా’ విషయానికొస్తే దీనికి ముందు సంగీత దర్శకుడిగా ఎంపికైంది ఎ.ఆర్.రెహమాన్. కానీ ఎక్కడ తేడా వచ్చిందో ఏమో.. ఆయన ఆరంభ దశలోనే తప్పుకున్నాడు.

దీంతో తమన్‌ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు. టీజర్ సమయానికి అమిత్ త్రివేది రంగంలోకి దిగాడు. అతను గూస్ బంప్స్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజర్‌ను పైకి లేపాడు. కానీ ఇప్పుడేమో అతను కేవలం పాటలకే పరిమితం.. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం జులియస్ పకియంను తీసుకున్నట్లు అప్ డేట్ బయటికి వచ్చింది. అమిత్ బ్యాగ్రౌండ్ స్కోర్2కు అంత మంచి పేరొచ్చాక.. అతడి పనితీరు నచ్చి తన తర్వాతి సినిమాకు కూడా చిరు పెట్టుకుంటున్నట్లు వార్తలొచ్చాక ‘సైరా’ ఆర్ఆర్ వేరే వ్యక్తికి అప్పగించడమేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English