కెరీర్ క్లోజ్ అనుకుంటే.. ఒక ఛాన్స్ ఇచ్చారు

కెరీర్ క్లోజ్ అనుకుంటే.. ఒక ఛాన్స్ ఇచ్చారు

హెబ్బా పటేల్ గుర్తుందా..? చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆమె తెలుగు సినిమాలపై తనదైన ముద్రే వేసింది. ‘కుమారి 21 ఎఫ్’లో ఆమె బోల్డ్ యాక్ట్స్‌కు యూత్ ఫిదా అయిపోయారు. ఈ ఊపులో మరికొన్ని సినిమాలతో కుర్రకారుకు గాలం వేసింది. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే తరహాలో ముందు వెనుక చూసుకోకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా చూసి చాలా వేగంగా ఫేడ్ అవుట్ అయిపోయిందీ ముంబయి భామ.

గత ఏడాది ‘24 కిస్సెస్’ అనే ఎరోటిక్ టచ్ ఉన్న సినిమా చేస్తే అది బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టేసింది. దీంతో టాలీవుడ్ నుంచి ఆమె అడ్రస్ గల్లంతయినట్లే కనిపించింది. ఈ మధ్య కొంచెం బరువు తగ్గి.. హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తుంటే.. అవకాశాల కోసం ఎన్ని తిప్పలు పడుతోందో అనుకున్నారంతా.

కానీ ఆ కష్టం హెబ్బాకు ఒక క్రేజీ ప్రాజెక్టులో అవకాశం తెచ్చిపెట్టింది. నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘భీష్మ’లో హెబ్బాకు ఒక స్పెషల్ రోల్ దక్కింది. ఈ సినిమాలో రష్మిక మందన్నా లీడ్ హీరోయిన్‌గా చేస్తోంది. హీరోతో సయ్యాట ఆడే రెండో కథానాయిక పాత్ర హెబ్బాకు ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత చిన్న రోల్ అయినా హెబ్బా ఓకే చెప్పక తప్పదు. ఇంతకుముందు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో రెండో హీరోయిన్‌గా హెబ్బా బాగా సెట్టయింది.

తమ సినిమాకు కూడా అలాగే కలిసొస్తుందని సెంటిమెంటుగా ఆమెను పెట్టుకున్నారో ఏమో? సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌ అంటున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి నిర్విరామంగా చిత్రీకరణ సాగిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకలు ముందుకొచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English