ఎక్కడెక్కడికో వెళ్తున్న ‘ఓ బేబీ’

ఎక్కడెక్కడికో వెళ్తున్న ‘ఓ బేబీ’

సమంత కెరీర్లో ‘ఓ బేబీ’ ఒక మైలురాయిలాగే నిలిచిపోయేలా ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇదొక చరిత్ర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగిస్తోందీ చిత్రం. ఈ వారం విడుదలైన కొత్త సినిమాల్ని మించి దీనికే వసూళ్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మేజర్ సిటీల్లోని మల్టీప్లెక్సుల్లోనూ ఈ సినిమాకు శని, ఆదివారాల్లో హౌస్ ఫుల్స్ పడ్డాయి.

ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓ బేబీ’ ఫుల్ రన్లో పెట్టుబడి మీద రెండు మూడు రెట్ల లాభాలు అందించేలా ఉంది. ఇంకా ఈ చిత్రం తమిళంలో విడుదల కావాల్సి ఉంది. కన్నడ, బెంగాలీ, కన్నడ, ఇంకా మరికొన్ని భాషల్లో దీన్ని డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారట. హిందీలో రీమేక్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. చైనాలో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతుున్నాయి.

ఆల్రెడీ బాలీవుడ్ సినిమాలు చైనా మార్కెట్‌ను గ్రాబ్ చేసే ప్రయత్నంలో ఉండగా.. నెమ్మదిగా తెలుగు సినిమాల్ని కూడా అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలను చైనీయులు బాగా ఇష్టపడుతుండటంతో ‘ఓ బేబీ’ వాళ్లకు బాగా రుచిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని మాతృక ‘మిస్ గ్రానీ’ ఆల్రెడీ చైనాలో విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ‘ఓ బేబీ’ సైతం చైనాలో రిలీజ్ కాబోతుండటం విశేషం. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి ధ్రువీకరించారు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English