విక్రమ్‌కు నెగెటివిటీ కనిపించలేదా?

విక్రమ్‌కు నెగెటివిటీ కనిపించలేదా?

దక్షిణాదిన ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి గొప్ప స్థాయికి ఎదిగిన నటుల్లో విక్రమ్ ఒకడు. ఒక సమయంలో ‘సామి’, ‘పితామగన్’, ‘అపరిచితుడు’ లాంటి సినిమాలతో తిరుగులేని స్థాయిని అందుకున్నాడతను. ఆ తర్వాత అంచనాలకు తగ్గ సినిమాలు చేయకపోయినా.. విక్రమ్‌కు ఉన్న గుర్తింపు, ఫాలోయింగే వేరు. ఐతే విక్రమ్ ఘన వారసత్వాన్నందుకుని తెరంగేట్రం చేస్తున్న ఆయన తనయుడు ధ్రువ్‌కు మాత్రం తొలి సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది.

‘అర్జున్ రెడ్డి’ లాంటి కల్ట్ మూవీని రీమేక్ చేయాలనుకోవడం అతడికి చేటు చేసింది. ముందు బాలా దర్శకత్వంలో తీసిన ఈ రీమేక్ అసలు విడుదలకే నోచుకోకుండా మరుగున పడిపోయింది. తర్వాత ‘అర్జున్ రెడ్డి’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన గిరీశయ్య దర్శకత్వంలో మళ్లీ సినిమా తీయగా.. దానికీ నెగెటివ్ రెస్పాన్సే వచ్చింది.

ఈ నేపథ్యంలో సెకండ్ వెర్షన్‌ను కూడా ఆపేస్తున్నారని.. అది కూడా విడుదల కాదని కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ తన కొత్త సినిమా ‘మిస్టర్ కేకే’ ప్రమోషన్ కోసం మీడియాను కలిసిన విక్రమ్ మాత్రం అలాంటిదేమీ లేదన్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుందని అన్నాడు. బాలా దర్శకత్వంలో చేసిన సినిమాకు తెలుగుతో పోలిస్తే కొన్ని మార్పులు జరిగాయని.. దానికి సరైన స్పందన రాకపోవడంతో పక్కన పెట్టామని.. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ను ఉన్నదున్నట్లుగా తమిళంలోకి తీసుకెళ్లామని అతను చెప్పాడు.

ఈ సినిమా తమిళంలో కూడా మంచి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఐతే రెండో వెర్షన్‌కు కూడా పెద్ద ఎత్తున నెగెటివ్ రెస్పాన్స్ రావడం విక్రమ్‌ గుర్తించనట్లే ఉంది. లేదంటే ధ్రువ్‌తో తనకు ఎదురవుతున్న పోటీ గురించి మాట్లాడుతూ.. ‘నాన్నా నీ సినిమా ట్రైలర్‌కు ఎన్ని వ్యూస్ వచ్చాయి. 11 మిలియన్లా? నా సినిమాకు 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి’ అని ధ్రువ్ తనను ఛాలెంజ్ చేస్తున్నట్లుగా విక్రమ్ చెప్పాడు. ధ్రువ్ సినిమాకు అంత నెగెటివిటీ ఉంటే ఇలా వ్యూస్ గురించి గొప్పలు పోతున్నాడంటే ఏమనుకోవాలి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English