నాగచైతన్యని బీట్‌ చేసిన సమంత!

నాగచైతన్యని బీట్‌ చేసిన సమంత!

తాను సాధించిన ఘన విజయాలు కంటే మజిలీతో భర్త సాధించిన విజయాన్నే అమితంగా ఆస్వాదించానని సమంత చెప్పింది. అయితే మజిలీ మాత్రమే కాదు... సోలోగా నాగ చైతన్య ఇంతవరకు సాధించిన అత్యధిక వసూళ్లని ఓవర్సీస్‌లో దాటేస్తోంది అతని సతీమణి. చైతన్య కెరియర్‌లో అత్యధిక వసూళ్లు తెచ్చుకున్న అతని సోలో చిత్రం ప్రేమమ్‌. దానిని 'ఓ బేబీ' అవలీలగా దాటేస్తోంది. అంతే కాదు అదృష్టం కలిసి వచ్చి ఈ చిత్రం మిలియన్‌ డాలర్ల మార్కుని దాటినా ఆశ్చర్యం లేదని ట్రేడ్‌ అంటోంది. కొత్తగా విడుదలైన సినిమాలు కనీస ప్రభావం చూపించలేకపోవడంతో, నిను వీడని నీడను నేనే, దొరసాని చిత్రాలకి ప్రింట్ల ఖర్చులు కూడా రాని నేపథ్యంలో ఓవర్సీస్‌లో ఈ వారం కూడా బేబీ హవానే నడుస్తోంది.

కొత్త సినిమాల వల్ల ఓ బేబీ డ్రాప్‌ అవుతుందని భావించారు కానీ వాటి వల్ల ఈ చిత్రానికి ఇంకా ప్లస్‌ అయింది. గత వారాంతంలో మిస్‌ అయిన జనం ఈ వారాంతంలో బేబీని చూసేందుకు రావడంతో సెకండ్‌ వీకెండ్‌లో కూడా మంచి వసూళ్లని బేబీ రాబట్టుకుంటోంది. సోలో హీరోయిన్‌గా అనుష్క తర్వాత ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఇంతటి ప్రభావం చూపిస్తున్నది ఓన్లీ సమంత అక్కినేని. ఓ బేబీ విజయం తర్వాత ఆమె సోలో చిత్రాలకి మార్కెట్‌ మరింత పెరగడం గ్యారెంటీ.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English