ఈ వయసులో ఇవేం విన్యాసాలు ఆలీ?

ఈ వయసులో ఇవేం విన్యాసాలు ఆలీ?

కమెడియన్‌గా ప్రస్థానం మొదలుపెట్టి హీరోలుగా మారిన చాలామంది.. తమ ఇమేజ్‌కు తగని సినిమాలతో ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదుర్కొంటూ ఉంటారు. ఈ తరంలో సునీల్, సప్తగిరి, షకలక శంకర్ లాంటి కమెడియన్లు దారి తప్పారు. ఇలాంటి వాళ్లంతా ఆలీని చూసి పాఠం నేర్చుకోవాలని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ‘యమలీల’తో పెద్ద హిట్ కొట్టాక ఆలీ ఏమీ హీరోయిజం ఉన్న సినిమాల కోసం ఊగిపోలేదు. హీరోగా తన ఇమేజ్‌కు తగ్గ సినిమాలే చేశాడు. ఇక కథానాయకుడిగా తనకు కెరీర్ లేదని తెలుసుకున్నాక మళ్లీ కామెడీ వేషాల్లోకి వచ్చేశాడు. కెరీర్‌ను పొడిగించుకున్నాడు. ఐతే యంగ్ ఏజ్‌లో అంత మెచ్యూరిటీ చూపించిన ఆలీ.. ఇప్పుడు లేటు వయసులో పూర్తిగా విచక్షణ కోల్పోయాడేమో అనిపిస్తోంది ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ట్రైలర్ చూస్తే.

కొన్ని నెలల కిందట ఆలీ హీరోగా ‘పండుగాడి ఫొటో స్టూడియో’ అనే సినిమా మొదలైంది. దిలీప్ రాజా అనే దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. దీని ట్రైలర్లో ఆలీ విన్యాసాలు చూస్తే బెంబేలెత్తడం ఖాయం. పెద్ద మాస్ హీరోలాగా బౌన్సింగ్ ఫైట్లు చేస్తూ, బిల్డప్ డైలాగులు కొడుతూ షాకిచ్చాడు ఆలీ. ఆయనకున్న ఇమేజ్‌కు ఈ వయసులో ఇలాంటి విన్యాసాలేంటో అర్థమే కావడం లేదు. ఒక సీన్లో హీరోయిన్‌ను కౌగిలించుకుని పొర్లిన తీరు చూస్తే ఇదేదో బి-గ్రేడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. కమెడియన్‌గా కూడా ఆలీ ఊసే లేని ఈ రోజుల్లో హీరోగా ఇలాంటి సినిమా చేసి ఏం సాధిద్దామనుకున్నాడో ఏంటో? ట్రైలర్ చూస్తేనే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక సినిమా చూస్తే పరిస్థితి ఏంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English