సంక్రాంతికి కమర్షియల్ విందే..

సంక్రాంతికి కమర్షియల్ విందే..

తెలుగు సినిమాలకు సంబంధించి అతి పెద్ద సీజన్ అంటే సంక్రాంతే. మూడు నాలుగు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజవుతుంటాయి ఈ సీజన్లో. ప్రేక్షకులకు భారీ అంచనాలుంటాయి ఈ సీజన్ మీద. ఐతే గత రెండేళ్లూ ఈ సీజన్ తీవ్ర నిరాశకు గురి చేసింది. గత ఏడాది ‘అజ్ఞాతవాసి’ ఫలితం సీజన్ ఉత్సాహాన్నే చల్లార్చేసింది.

ఈ ఏడాది ‘వినయ విధేయ రామ’, ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ డిజాస్టర్లయి ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేశాయి. ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకుని ‘ఎఫ్-2’ లాంటి యావరేజ్ మూవీ వసూళ్ల మోత మోగించుకుంది. ఐతే గత రెండు సంక్రాంతి సీజన్లతో పోలిస్తే వచ్చే ఏడాది వినోదం ఓ రేంజిలో ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్లు సంక్రాంతి బెర్తుల్ని ఖరారు చేసుకున్నారు.

మహేష్ బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి రిలీజ్ అనే విషయం టైటిల్ అనౌన్స్ చేసినపుడే స్పష్టమైంది. తాజాగా అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా సైతం సంక్రాంతి రిలీజ్ అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇవి రెండూ కమర్షియల్ ఎంటర్టైనర్లే. అనిల్ రావిపూడికి వినోదాత్మక చిత్రాలు తీయడంలో తిరుగులేదు. మహేష్ బాబుతో అతడి సినిమా అంటే పతాక స్థాయి వినోదం ఉంటుందని ఆశిస్తున్నారు.

ఇక త్రివిక్రమ్ అంటే వినోదానికి కేరాఫ్ అడ్రస్. అల్లు అర్జున్‌తో ఆయన కాంబినేషన్ కూడా వినోదం మీద అంచనాలు పెంచేదే. వీటికి తోడు ఇంకో రెండు సినిమాలు రావొచ్చని ప్రచారం జరుగుతోంది. బాలయ్య-కె.ఎస్.రవికుమార్ చిత్రం, మారుతి-సాయిధరమ్ తేజ్‌‌ల ‘ప్రతి రోజూ పండగే’ కూడా సంక్రాంతికే రావచ్చు. అవి కూడా కమర్షియల్ సినిమాలే. మొత్తానికి రాబోయే సంక్రాంతికి కమర్షియల్ విందు చూడబోతున్నామన్నమాటే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English