మరుగున పడ్డ క్రేజీ మూవీకి మోక్షం

మరుగున పడ్డ క్రేజీ మూవీకి మోక్షం

గౌతమ్ మీనన్ సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. ‘కాక్క కాక్క’, ‘రాఘవన్’ సహా అతడి నుంచి అద్భుతమైన సినిమాలొచ్చాయి. గౌతమ్ తీసిన ఫ్లాప్ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని పూర్తిగా నిరాశ పరిచినవి కావు. తన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తాడతను. నిర్మాతగా కూడా గౌతమ్ తన అభిరుచిని చాటుకున్నాడు.

కాకపోతే గత కొన్నేళ్లుగా గౌతమ్ మీనన్ సినిమాలతో వస్తున్న సమస్య ఏంటంటే.. అతడి సినిమాలు మధ్య మధ్యలో ఆగిపోతున్నాయి. రిలీజ్ బాగా ఆలస్యం అయిపోతోంది. అతను దర్శకత్వం వహించిన రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. అతను నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఇంకో రెండు సినిమాలకు కూడా బ్రేక్ పడింది. ఫైనాన్షియర్లతో గొడవల కారణంగానే వీటికి బ్రేక్ పడింది.

ఇక గౌతమ్ నుంచి ఇప్పుడిప్పుడే ఈ సినిమా వచ్చే అవకాశం లేదని అందరూ అనుకుంటుండగా.. అతను పక్కన పెట్టేసిన ఒక క్రేజీ మూవీకి మోక్షం లభించింది. ధనుష్ హీరోగా మూడేళ్ల కిందట అతను ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ అనే సినిమా మొదలుపెట్టాడు. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. ఆరు నెలల్లోనే సినిమా పూర్తి చేశాడు. కానీ ఎంతకీ ఈ చిత్రం విడుదల కాలేదు. ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు సినిమాను వెనక్కి తోసుకుంటూ వెళ్లారు.

అయితే ఈ సినిమా వరకు ఫైనాన్షియర్లతో ఇష్యూస్ సెటిల్ చేసుకుని విడుదలకు రంగం సిద్ధం చేసుకున్నాడట గౌతమ్. ‘లై’తో టాలీవుడ్‌కు పరిచయం అయిన మేఘా ఆకాష్ ఈ చిత్రంతోనే కథానాయికగా ఇంట్రడ్యూస్ కావాల్సింది. ఈ ప్రేమకథ ‘డియర్ కామ్రేడ్’కు పోటీగా జులై 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English