ప్లేస్‌ పోతుందని నాని భయం

ప్లేస్‌ పోతుందని నాని భయం

నాని నటిస్తోన్న 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రం ఇంకా షూటింగ్‌ పూర్తి చేసుకోలేదు. నాని గాయపడడంతో షెడ్యూల్స్‌ అటు ఇటు అయ్యాయి. అలాగే అనివార్య కారణాల వల్ల సబ్జెక్టుని కాస్త ఆల్టర్‌ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో గ్యాంగ్‌లీడర్‌ ముందుగా అనుకున్నట్టు ఆగస్టు 30కి రాలేదనే ప్రచారం మొదలయింది. కొన్ని మీడియా వర్గాలు అయితే ఈ చిత్రం సెప్టెంబరుకి వాయిదా పడిందని కూడా తేల్చేసాయి. సెప్టెంబరులో వేరే చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి కనుక అక్కడ ఎంత స్పేస్‌ వుందనేది గ్యాంగ్‌లీడర్‌కి తెలియదు. ఆగస్టు 30న నాని సినిమా వుందని పలు చిత్రాలని ఆ రోజు విడుదల చేయకుండా వేరే డేట్‌ కోసం నిర్మాతలు చూస్తున్నారు.

ఈలోగా ఈ చిత్రం వాయిదా పడుతుందనే వార్త రావడంతో ఆగస్ట్‌ 30 స్లాట్‌ దక్కించుకోవాలని పలువురు పోటీ పడుతున్నారు. ఎలాగోలా తంటాలు పడి ఇదే డేట్‌కి సినిమా విడుదల చేసుకోవాలని గ్యాంగ్‌లీడర్‌ రూపకర్తలు భావిస్తున్నారు. లేదంటే ఫ్రీ డేట్‌ పోయి మరేదైనా సినిమాతో క్లాష్‌ పెట్టుకోవాల్సి వస్తుందని కంగారు పడుతున్నారు. అందుకే షూటింగ్‌ పూర్తవుతుందా లేదా అనే దానిపై క్లారిటీ లేకపోయినా కానీ ఆగస్టు 30న విడుదల చేస్తున్నామంటూ ఉటంకిస్తున్నారు. తద్వారా ఈ డేట్‌కి మరే సినిమా షెడ్యూల్‌ అవకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ డేట్‌కి గ్యాంగ్‌లీడర్‌ రిలీజ్‌ అయ్యేదానిపై అనుమాన మేఘాలయితే ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English