త్రీ స్టార్‌ రేటింగ్‌తో పనవుతుందా?

త్రీ స్టార్‌ రేటింగ్‌తో పనవుతుందా?

ఖాన్‌ల నుంచి బాలీవుడ్‌ సింహాసనాన్ని తీసుకుంటాడని అనుకున్న హృతిక్‌ రోషన్‌ ఏనాడో ట్రాక్‌ తప్పేసాడు. రెగ్యులర్‌ సినిమాలు ఆడడం లేదని ఇటీవల ఎక్స్‌పెరిమెంట్లు మొదలు పెట్టిన హృతిక్‌కి 'కాబిల్‌'లో అంధుడి పాత్ర వల్ల పెద్దగా ఒరిగింది లేదు. ఆ చిత్రం తర్వాత రెండేళ్లకి పైగా విరామం తీసుకుని 'సూపర్‌ 30'తో వస్తున్నాడు. వాస్తవ సంఘటనలతో రూపొందిన ఈ చిత్రంలో హృతిక్‌ డీ గ్లామరైజ్డ్‌ క్యారెక్టర్‌ చేసాడు. చాలా కాలంగా నిర్మాణంలో వున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చినా కానీ సమీక్షకులు మాత్రం తెగ పొగిడేస్తారనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదలకి ముందు రోజు వచ్చిన రివ్యూలు చూస్తే 'సూపర్‌ 30' అంత సూపర్‌గా లేదని మాత్రం తేలిపోయింది.

ఈ చిత్రానికి మహా అయితే మూడు రేటింగ్‌ ఇస్తూ... అది కూడా హృతిక్‌ నటనకి, భావోద్వేగాలకీ అనే సమీక్షలు వస్తున్నాయి. హృతిక్‌ చాలా ఆశలు పెట్టుకున్న సూపర్‌ 30కి ఆశాజనకమయిన ఆరంభం అయితే కాదిది. ఈ తరహా చిత్రాలకి సమీక్షకులు ఊదరగొట్టేసి నాలుగులు, అయిదులు రేటింగులిస్తే తప్ప జనం థియేటర్ల వరకు రారు. చూస్తోంటే మరోసారి హృతిక్‌ కష్టానికి మిశ్రమ ఫలితం తప్పేట్టు లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English