'ఓ బేబీ'ని ఆమెకి ఇచ్చిన రాణా

'ఓ బేబీ'ని ఆమెకి ఇచ్చిన రాణా

కొరియన్‌ కథ అయినా కానీ తెలుగు ప్రేక్షకులని మెప్పించి మంచి విజయాన్ని అందుకున్న 'ఓ బేబీ'కి యూనివర్సల్‌ అప్పీల్‌ వుందని రానా దగ్గుబాటి భావిస్తున్నాడు. తెలుగులో తన తండ్రి సురేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయడానికి రానా ప్రయత్నాల్లో వున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌తో మంతనాలు జరిపాడని, ఆమె కూడా ఈ పాత్ర చేయడానికి సుముఖత వ్యక్తం చేసిందని చెబుతున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే హిందీ 'ఓ బేబీ'కి కొబ్బరికాయ కొట్టేస్తారు.

తెలుగులో నాగశౌర్య చేసిన పాత్రని రానా చేస్తాడని కూడా అంటున్నారు. తెలుగునాట సమంతకి వున్న ఇమేజ్‌ ఆలియాకి కూడా వుంది కనుక ఆమె కంటే బెటర్‌ ఛాయిస్‌ వుండదు. రాజీ చిత్రంతో సోలోగా సినిమాని నడిపించే సత్తా వుందని కూడా చాటుకుంది కనుక బాక్సాఫీస్‌ పర్‌ఫార్మెన్స్‌కి కూడా ఢోకా వుండదు. ఇదిలావుంటే రాజమౌళి తీస్తోన్న మెగా మల్టీస్టారర్‌లో రామ్‌ చరణ్‌ సరసన నటిస్తోన్న ఆలియా భట్‌ ఆ చిత్రం షూటింగ్‌లో ఇటీవలే జాయిన్‌ అయింది. ఆలియా ఏది చేసినా ప్రత్యేకంగా వుంటుంది కనుక ఆమె పాత్రకి తగినంత ప్రాధాన్యత ఇచ్చి ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య కూడా షైన్‌ అయ్యేలా ఆర్‌.ఆర్‌.ఆర్‌ రచయితల బృందం జాగ్రత్తలు తీసుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English