భయపడాల్సింది వాళ్లు కాదు.. ప్రభాసే

భయపడాల్సింది వాళ్లు కాదు.. ప్రభాసే

పెద్ద సినిమాలకు పోటీగా చిన్న స్థాయి సినిమాలు రిలీజవుతుంటే.. అవి పోటీని ఎలా తట్టుకుని నిలబడతాయో అన్న సందేహాలు వ్యక్తమవుతుంటాయి. కానీ కొన్నిసార్లు అంచనాలు తిరగబడుతుంటాయి. భారీ చిత్రాలు బోల్తా కొట్టి.. పోటీగా వచ్చిన చిన్న సినిమాలకు మంచి టాక్ తెచ్చుకుని అవి బాక్సాఫీస్ దగ్గర పైచేయి సాధిస్తాయి. ఈ ఏడాది సంక్రాంతికి ఏమైందో అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘వినయ విధేయ రామ’, ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ సినిమాలు అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. మీడియం రేంజ్ సినిమాగా రిలీజైన ‘ఎఫ్-2’ మాత్రం మోత మోగించేసింది. ఇదే మిగతా రెండు పెద్ద సినిమాల్ని దెబ్బ కొట్టింది. కాబట్టి ఏదైనా భారీ చిత్రం రిలీజవుతున్నపుడు పోటీగా వచ్చే చిన్న, మీడియం రేంజ్ సినిమాల్ని తక్కువ అంచనా వేస్తే ప్రమాదమే.

ఈ ఏడాది ఇండియాలో అత్యంత భారీ చిత్రం అనదగ్గ ‘సాహో’కు పోటీగా వస్తున్న మీడియం రేంజ్ హిందీ సినిమాల విషయంలోనూ ఓ కన్నేయాల్సిందే. ‘సాహో’ పోటీని ‘మిషన్ మంగల్’; ‘బాట్లా హౌస్’ చిత్రాలు తట్టుకోగలవా అని మొన్నటిదాకా అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ‘మిషన్ మంగల్’ టీజర్, ‘బాట్లా హౌస్’ ట్రైలర్ చూశాక అవి ఎంత బలమైన కంటెంట్‌తో తెరకెక్కాయో అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. ‘సాహో’తో పోటీ ఎలా ఉన్నా అవి బాగా ఆడేలాగే కనిపిస్తున్నాయి. ‘సాహో’నే వీటిని చూసి భయపడాలేమో అనిపిస్తోంది. ‘సాహో’ కథా బలం కంటే అదనపు హంగుల్ని నమ్ముకున్న సినిమా. ఇలాంటివి గ్యారెంటీగా ఆడుతున్నాయని అనలేం. ముఖ్యంగా ‘మిషన్ మంగల్’, ‘బాట్లాహౌస్’ చాలా మంచి టాక్ తెచ్చుకుంటే ఉత్తరాదిన ప్రభాస్ సినిమాకే కష్టాలు తప్పవేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English