నానికి షాకిచ్చిన బ్రహ్మి, ఆలీ

నానికి షాకిచ్చిన బ్రహ్మి, ఆలీ

నేచురల్ స్టార్ నాని తొలిసారిగా ఒక యానిమేటెడ్ మూవీలో ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న హాలీవుడ్ మూవీ ‘లయన్ కింగ్’లో హీరో అనదగ్గ సింబా పాత్రకు నాని వాయిస్ ఇచ్చాడు. ఐతే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి ముందు వరకు తనకు కొన్ని రకాల అభిప్రాయాలు ఉండేవని.. కానీ అవి ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయంలో తొలగిపోయాయని నాని చెప్పాడు. చిన్నప్పట్నుంచి ఎన్నో హాలీవుడ్ సినిమాల్ని తెలుగు డబ్బింగ్‌లో చూశానని.. డబ్బింగ్ కంటే ఒరిజినలే బాగుంటాయనే ఫీలింగ్‌లో ఉండేవాడినని.. ‘లయన్ కింగ్’కు డబ్బింగ్ చెప్పమని తనను అడిగాక కూడా సినిమా చూసే విషయంలో తన ప్రయారిటీ ఇంగ్లిష్ వెర్షనే అన్నాడు నాని. తన ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా ముందు ఇంగ్లిష్ వెెర్షన్‌కు తీసుకెళ్లి.. ఆపై తెలుగులో చూపించాలని అనుకున్నట్లు నాని వెల్లడించాడు.

ఐతే సింబా పాత్రకు డబ్బింగ్ కోసం వెళ్లినపుడు ముందు ఇంగ్లిష్ వెర్షన్ చూస్తే చాలా బాగా అనిపించిందని.. తాను ఎలా డబ్బింగ్ చెప్పాలనే విషయంలో క్లారిటీ కోసం ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ పూర్తయిన కొన్ని సన్నివేశాల్ని ప్లే చేయమన్నానని.. అప్పుడు బ్రహ్మానందం, ఆలీ వాయిస్ ఇచ్చిన కొన్ని సీన్లు చూపించారని.. అవి పది నిమిషాలు చూసి తాను పగలబడి నవ్వుకున్నానని, అవి అద్భుతంగా అనిపించాయని.. బాగా ఎంజాయ్ చేసి, చప్పట్లు కొట్టి ఆ తర్వాత తన పని మొదలుపెట్టానని చెప్పాడు నాని. ‘లయన్ కింగ్’ సినిమా తన కోసం, జగపతిబాబు లాంటి వాళ్ల కోసం కాకుండా బ్రహ్మి, ఆలీల కోసమే చూడాలని.. వాళ్లు డబ్బింగ్ చెప్పిన సీన్లు మామూలుగా పేలలేదని చెప్పాడు నాని. ఇప్పటిదాకా ఎన్ని హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలైనా చూసి ఉండొచ్చని.. కానీ ‘లయన్ కింగ్’ చాలా భిన్నమైన అనుభూతిని ఇస్తుందని.. దీనికి డబ్బింగ్ చెప్పిన వ్యక్తుల కారణంగా ఇది మన సినిమా అనిపిస్తుందని నాని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English