మామతో అయ్యింది.. ఇక అల్లుడితో

మామతో అయ్యింది.. ఇక అల్లుడితో

కార్తీక్ సుబ్బరాజ్ అనే కుర్ర తమిళ దర్శకుడిపై తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే గురి ఉండేది. ‘పిజ్జా’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడతను. ఆ తర్వాత అతను తీసిన ‘జిగర్ తండ’ సౌత్ ఇండియా అంతటా పాపులర్ అయ్యాడు కార్తీక్. ఈ చిత్రమే ఇప్పుడు ‘వాల్మీకి’గా తెలుగులోకి వస్తోంది.

కార్తీక్ మూడో సినిమా ‘ఇరైవి’ కూడా విమర్శల ప్రశంసలందుకుంది. ఐతే ఈ చిత్రాలతో తనపై అంచనాల్ని అమాంతం పెంచేసిన కార్తీక్.. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా విషయంలో మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయాడు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పేట్ట’కు మంచి హైప్ వచ్చింది కానీ.. సినిమా చివరికి ఫ్లాపే అయింది. తెలుగులో అయితే కనీస స్థాయిలో కూడా ఆడలేదీ చిత్రం. ఈ సినిమా తర్వాత కార్తీక్ జోరుకు బ్రేక్ పడింది.

ఇప్పుడతను రజనీ అల్లుడు ధనుష్‌తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. వీళ్లిద్దరి కలయికలో ‘పేట్ట’ కంటే ముందే సినిమా రావాల్సింది. కానీ అది అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టును రివైవ్ చేస్తున్నారట. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు అల్ పాసినో నటించబోతున్నట్లు సమాచారం. ఇంతకుముందే అతడితో సంప్రదింపులు జరిపారు.

కానీ సినిమా ఆగిపోవడంతో తర్వాత ఆయనతో మాట్లాడలేదు. మళ్లీ ఇప్పుడు అల్ పాసినోతో మాట్లాడి ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారట. ధనుష్ ఆల్రెడీ ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో కొంత పాపులారిటీ సంపాదించాడు. నిజంగా అల్ పాసినో ఈ సినిమాకు ఒప్పుకుని.. కార్తీక్ తన స్థాయికి తగ్గట్లు సినిమా తీస్తే ఇది ఒక రేంజిలో ఉండే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English