రాశి అందరినీ కొట్టేసేలా ఉందే..

రాశి అందరినీ కొట్టేసేలా ఉందే..

కెరీర్ ఆరంభంలో చిన్న, మీడియం రేంజి సినిమాలు చేసే హీరోయిన్లు.. టాప్ లీగ్‌లోకి చేరడానికి చాలా టైం పడుతుంది. ఈ కేటగిరి హీరోయిన్లు చాలామంది ఒక స్థాయిని మించి ఎదగలేకపోతుంటారు. అందం, అభినయం రెండూ ఉన్నా కూడా వీళ్లపై ఒక ముద్ర వేసేసి పెద్ద సినిమాలకు కన్సిడర్ చేయరు. ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయిన రాశి ఖన్నా పరిస్థితి కూడా అంతే.

ఐదారేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రాశి ఇప్పటిదాకా పెద్ద స్టార్లలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌తో మాత్రమే చేసింది. అది కూడా కథానాయిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేని ‘జై లవకుశ’లో. అది మినహా రాశి చేసినవన్నీ మీడియం రేంజి సినిమాలే. ఐతే ఈ మధ్యే రాశి కెరీర్లో కొంచెం కదలిక కనిపిస్తోంది. తమిళంలో వరుసగా హిట్లు కొట్టిన ఆమెను పెద్ద సినిమాలకు కన్సిడర్ చేస్తున్నారు.

ఏకంగా సూపర్ స్టార్ విజయ్ సరసన సినిమా చేసే అవకాశం అందుకుంది రాశి. ప్రస్తుతం ‘బిగిల్’ సినిమా చేస్తున్న విజయ్.. దీని తర్వాత ఓ సినిమా కమిటయ్యాడు. అందులో రాశినే కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. రాశి కెరీర్లో దీన్ని బిగ్గెస్ట్ ఛాన్స్‌గా చెప్పొచ్చు. ఆల్రెడీ అందం, అభినయంం రెండింటితోనూ ఆమె తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విజయ్ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే రాశి రేంజే మారిపోవడం ఖాయం. విజయ్ సినిమా కమిటైన సమయంలోనే రాశికి తెలుగులో మరో పెద్ద అవకాశం దక్కినట్లుగా వార్తలొస్తున్నాయి.

అల్లు అర్జున్ సరసన ‘ఐకాన్’ సినిమా కోసం రాశినే కథానాయికగా కన్సిడర్ చేస్తున్నట్లు సమాచారం. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజుతో ఆల్రెడీ ‘శ్రీనివాస కళ్యాణం’ చేసింది రాశి. ఆయన సిఫారసు మేరకే రాశిని ‘ఐకాన్’లో ఓ కథానాయికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు క్లిక్ అయితే.. మిగతా స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి రాశి టాప్‌కు వెళ్లిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English