శర్వానంద్‌కే నమ్మకం లేదా?

శర్వానంద్‌కే నమ్మకం లేదా?

'రణరంగం' చిత్రం పట్ల శర్వానంద్‌ నమ్మకంగా లేడా? ఇదే టాక్‌ వినిపిస్తోంది ఫిలింనగర్‌ పుర వీధులలో. రణరంగం చిత్రాన్ని ఎంతో నమ్మకంతో తలపెట్టిన శర్వానంద్‌ అది షేపప్‌ అయిన తీరుతో ఏమాత్రం సంతృప్తిగా లేడట. దర్శకుడు సుధీర్‌ వర్మ మరోసారి 'గాడ్‌ఫాదర్‌' ఫార్ములాతో ఈ చిత్రాన్ని తీసాడని, ఇప్పటికే ఆ ఫార్మాట్‌లో చాలా చిత్రాలు రావడంతో ఇది ప్రేక్షకులకి కొత్తగా ఏమీ అనిపించదని శర్వానంద్‌ భావిస్తున్నాడట.

ఇంకా విడుదల కాని ఈ చిత్రం పట్ల అనాసక్తిగా మాట్లాడుతూ తదుపరి ప్రాజెక్టుల గురించే డిస్కస్‌ చేస్తున్నాడు కానీ 'రణరంగం' గురించి ఏమంత ఇంట్రెస్ట్‌ చూపించడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన టీజర్‌కి కూడా మిశ్రమ స్పందనే వచ్చింది. అందరూ శర్వానంద్‌ లుక్స్‌ లేదా షాట్‌ మేకింగ్‌ గురించే మాట్లాడారు తప్ప కంటెంట్‌ బాగుందనే కాంప్లిమెంట్స్‌ అయితే రాలేదు. హాలీవుడ్‌ చిత్రాల ఇన్‌ఫ్లుయన్స్‌ అధికంగా వుండే సుధీర్‌ వర్మ ఆల్రెడీ పలువురు దర్శకులు వండి వార్చేసిన కాన్సెప్టులనే మళ్లీ ఎత్తుకుంటున్నాడు.

అతని గత చిత్రాలు దోచెయ్‌, కేశవ కూడా అంతంతమాత్రంగానే ఆడాయి తప్ప 'స్వామిరారా' మాదిరిగా ఆకట్టుకోలేదు. మరి శర్వానంద్‌కి నమ్మకాలు లేవనే వదంతులలో నిజమెంత అనేది తెలియడానికి ఆగస్ట్‌ 2 వరకు వేచి చూడక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English