బడ్జెట్‌ కాదు.. సబ్జెక్ట్‌ చెప్పు: దిల్‌ రాజు

 బడ్జెట్‌ కాదు.. సబ్జెక్ట్‌ చెప్పు: దిల్‌ రాజు

అగ్ర నిర్మాతలంతా ఆచి తూచి సినిమాలు తీస్తూ వుంటే ఇప్పటికీ నాలుగైదు సినిమాలతో బిజీగా వుంటోన్న ఒకే ఒక్కడు దిల్‌ రాజు. గతంలో అయితే కుటుంబ కథా చిత్రాలు మాత్రమే తీయాలని చూసేవాడు రాజు. కానీ ఇప్పుడు ట్రెండు మారడం వల్ల ఒకే తరహా చిత్రాలకి కట్టుబడడం వేస్ట్‌ అంటున్నాడు. అన్ని జోనర్ల చిత్రాలు చేస్తానంటూ అందరు దర్శకులకీ వెల్‌కమ్‌ బోర్డు పెడుతున్నాడు.

దిల్‌ రాజు దగ్గర అయిదు కోట్ల నుంచి వంద కోట్ల సినిమాల వరకు అన్నిటికీ బడ్జెట్‌ రెడీగా వుంటుంది. అయితే బడ్జెట్‌ దర్శకుడిని డిసైడ్‌ చేయనివ్వడు. సబ్జెక్ట్‌ విని నచ్చితే దానికి ఎంత ఖర్చు పెడితే వర్కవుట్‌ అవుతుందనేది దిల్‌ రాజు డిసైడ్‌ చేస్తాడు. ఎంత క్రేజీ ప్రాజెక్ట్‌ అయినా కానీ బడ్జెట్‌ ఫిక్స్‌ చేసుకుని డిస్కస్‌ చేయడం రాజుకి అస్సలు నచ్చదు. ఆమధ్య భారతీయుడు సీక్వెల్‌ తీయడానికి దిల్‌ రాజు ఉత్సాహపడ్డాడు కానీ శంకర్‌ బడ్జెట్‌ గురించి మాత్రమే మాట్లాడుతుంటే దిల్‌ రాజు గౌరవంగా తప్పుకున్నాడు.

తాజాగా తనని కలిసిన బోయపాటి శ్రీనుకి కూడా అదే చెప్పాడు. ఎంత ఖర్చు పెడితే ఒక సినిమా లాభదాయకమనేది తనకి తెలుసునని, కనుక కథ చెబితే ఎంత బడ్జెట్‌ ఇచ్చేదీ చెప్తానే తప్ప బడ్జెట్‌ ఫిక్స్‌ చేసుకుని వస్తే తనతో కుదరదని ఖరాఖండీగా చెప్పేసాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English