మంచి సినిమా చేస్తే ఇలాగే ఉంటుంది

మంచి సినిమా చేస్తే ఇలాగే ఉంటుంది

బాలీవుడ్లో ఖాన్ త్రయానికి ఒకప్పుడు గట్టి పోటీ ఇచ్చి.. వాళ్లకు సవాలు విసిరిన హీరోల్లో హృతిక్ రోషల్ ఒకడు. తొలి సినిమా ‘కహోనా ప్యార్ హై’తో రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయిపోయిన అతను.. ఆ తర్వాత ‘కోయీ మిల్ గయా’, ‘క్రిష్’, ‘ధూమ్-2’ లాంటి సినిమాలతో తిరుగులేని విజయాలందుకున్నాడు. తన ఇమేజ్‌ను బాగా బిల్డ్ చేసుకుని సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు.

ఐతే హృతిక్ హీరోయిజం ఎక్కువగా ఉన్న సినిమాలు చేసినపుడు మాత్రమే అతడికి విజయాలు అందాయి. కొంచెం రూటు మార్చి వైవిధ్యమైన, నటనకు అవకాశమున్న పాత్రలు, సినిమాలు చేసినపుడల్లా అతడికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఒకప్పుడు అతను చేసిన ‘గుజారిష్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దాన్ని క్రిటిక్స్ గొప్ప సినిమాగా పేర్కొన్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం వచ్చింది.

ఇక రెండేళ్ల కిందట హృతిక్ ‘కాబిల్’ అనే మరో మంచి సినిమా చేశాడు. దానికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు హృతిక్ ‘సూపర్ 30’ పేరుతో మరో మంచి సినిమా చేశాడు. పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఐఐటీయన్లుగా తయారు చేసిన ఆనంద్ కథతో తెరకెక్కిన చిత్రమిది. దీని ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి సినిమాలా కనిపించింది. కానీ ఈ శుక్రవారం రిలీజవుతున్న ‘సూపర్ 30’కి ఆశించిన బజ్ లేదు. ఈ చిత్రం రిలీజవుతున్నట్లే కనిపించడం లేదు.

బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. హృతిక్ కెరీర్లో ఏ సినిమాకూ ఇంత లో బజ్ లేదు. కంటెంట్ మీద ధీమాగా ఉన్న చిత్ర బృందం సినిమాను సరిగ్గా ప్రమోట్ కూడా చేయలేదు. హృతిక్ కూడా సినిమాను ఆశించిన స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ హృతిక్ మంచి సినిమా చేసినపుడల్లా అతడికి సరైన ఫలితం దక్కేలా కనిపించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English