అన్ని కిస్సులు పెడితే జస్ట్ ఇవే వచ్చాయ్

అన్ని కిస్సులు పెడితే జస్ట్ ఇవే వచ్చాయ్

అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఎన్ని ముద్దులు పెట్టాడో, హీరోయిన్ శాలిని పాండే కూడా అన్నే ముద్దులు పెట్టింది. అయితే ఆ లిప్ కిస్సులతో అవతల విజయ్ టాప్ స్టార్ అయిపోయాడు కాని, అతడి హీరోయిన్ మాత్రం ఏమీ కాలేకపోయింది. పైగా కేవలం మహానటి, 118, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో గెస్ట్ పాత్రలిచ్చి సరిపెట్టేశారు మనోళ్ళు.

ఆ పాత్రలన్నీ పూర్తయ్యాక అచ్చంగా ఫుల్ హీరోయిన్ రోల్ ఏదైనా ఉందా అంటే.. రాజ్ తరుణ్‌ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో మెరవనుందట ఈ బీహార్ పోరీ. ఆ తరువాత రాజ్ తరుణ్‌‌తోనే మరో సినిమా కూడా చేసే ఛాన్సుందట. తమిళంలో ఓ మూడు నాలుగు సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్న శాలినీ, ఎందుకోగాని తెలుగులో మాత్రం ఎవ్వరినీ ఇంప్రెస్ చేయలేకపోతోంది. దానికి కారణం ఏమైయుంటుంది??

నిజానికి తెలుగులో కమర్షియల్ హీరోయిన్‌గా చేయడానికి చాలా రోల్స్ వచ్చినా కూడా, ఎందుకో శాలిని వాటిని అంగీకరించట్లేదట. నా పాత్ర తాలూకు తీరుతెన్నులేంటి, కథలో నా రోల్ ఏంటి, రోల్‌లో డెప్త్ ఏంటి వంటి యక్ష ప్రశ్నలు అడగటంతో, తెలుగు దర్శకులు చాలామంది ఆమెను పక్కనెట్టేస్తున్నారని ఒక టాక్ వినిపిస్తోంది. అటువంటి ప్రశ్నలు అడగటం తప్పు కాకపోయినా కూడా, వరుసగా అవే ప్రశ్నలు అడిగితే ఇలా ఆఫర్లు కనిపించకుండాపోతాయ్. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English