గాసిప్‌: భార్య దూరమై డిప్రెషన్‌లో హీరో?

గాసిప్‌: భార్య దూరమై డిప్రెషన్‌లో హీరో?

ఫిలింనగర్‌ వీధుల్లో వినిపిస్తోన్న అనేకానేక పుకార్లలో ఇదీ ఒకటి. అతనో టాలెంటెడ్‌ యాక్టర్‌ అని అందరితో కితాబులు అందుకున్నాడు. తెలుగు సినిమా వెరైటీ చిత్రాలవైపుగా నడవక ముందే జనాలకి అలాంటి సినిమాలు కావాలని గుర్తించి కొత్త రకం ఐడియాలని ప్రోత్సహించాడు. అయితే స్ట్రాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వున్నా కానీ అతను వైఫల్యాలు తప్పించుకోలేకపోయాడు. మళ్లీ తిరిగి పుంజుకుని విజయాలు అందుకోలేకపోయాడు.

ఇదే సమయంలో పర్సనల్‌ లైఫ్‌ కూడా అతనికి అనుకూలంగా సాగడం లేదు. ఇష్టపడి పెళ్లాడిన భార్య అతడిని విడిచిపోయిందట. దాంతో ఆ యువ హీరో మరింతగా డిప్రెషన్‌కి గురయ్యాడని, కొత్త సినిమాల ఆఫర్ల కోసం చూడకుండా మద్యం, మాదకద్రవ్యాల మత్తులో మునిగి తేలుతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. స్థలం మారిస్తే అయినా మామూలు అవుతాడనే ఉద్దేశంతో అతడిని విదేశాలకి పంపించారట. అయినప్పటికీ అతనిలో ఏ మార్పు లేదని, అటు కెరియర్‌పై ధ్యాస పెట్టకపోవడమే కాకుండా తన వాళ్ల గురించి, అభిమానుల గురించి కూడా అతను ఆలోచించడం లేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English