రామ్‌ చరణ్‌ ఒక టీమ్‌ని దించాడు

రామ్‌ చరణ్‌ ఒక టీమ్‌ని దించాడు

'ఆర్‌.ఆర్‌.ఆర్‌' షూటింగ్‌తో చరణ్‌ వచ్చే జనవరి వరకు చాలా బిజీగా వుంటాడు. ఈ కారణం వలనే అతను 'సైరా' పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా చూసుకోలేకపోతున్నాడు. అక్టోబర్‌ 2న విడుదలయ్యే సైరాకి ఇంతవరకు సరయిన ప్రచారం జరగలేదు. వివిధ భాషలలో విడుదల చేస్తున్నారు కనుక ప్రమోషన్స్‌ పరంగా సరయిన స్ట్రాటజీ వుండాలని చరణ్‌ ఒక టీమ్‌ని అపాయింట్‌ చేసుకున్నాడు. వీరికి భారీ స్థాయిలోనే చెల్లిస్తున్నారని సమాచారం.

ఇందుకోసం సదరు బృందం చరణ్‌ని సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ కావాలని కోరారు. అందుకే ఇంతకాలం ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా వున్న చరణ్‌ ఇప్పుడు ఇన్‌స్టా పేజ్‌ ఓపెన్‌ చేసాడు. ట్విట్టర్‌లో కూడా రీఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. సాహో ప్రచారం మొదలు కావడానికి ముందే ప్రభాస్‌ కూడా ఇలా వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై సడన్‌గా ప్రత్యక్షమయ్యాడు. అది కూడా పీఆర్‌ టీమ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ మీదే చేసాడు.

ఇప్పుడు చరణ్‌ కూడా వారినే ఫాలో అవుతున్నాడు. ఇది అభిమానులకి శుభవార్తే కానీ స్టార్‌ హీరోలు మొదట్నుంచీ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌పై యాక్టివ్‌గా వుంటే ఈ తరహా ప్రమోషన్స్‌కి బాగా హెల్ప్‌ అవుతుంది. రాజమౌళికి బాహుబలి టైమ్‌లో, మహేష్‌కి మహర్షి టైమ్‌లో అది ఎంత ప్లస్‌ అయిందో తెలిసిందే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English