రానా వెయిట్ తగ్గడం వెనుక రీజన్ అదేనట

రానా వెయిట్ తగ్గడం వెనుక రీజన్ అదేనట

అసలు దిట్టంగా కుదమట్టంగా ఉండే రానా దగ్గుబాటి.. తన భల్లాలదేవ లుక్‌లో ఒక రేంజులో ఉన్నాడే అనుకున్నప్పుడు.. మనోడు సడన్‌గా సన్నబడిపోయాడు. ఎముకుల గూడు తరహాలో మారిపోయి పొడుగ్గా గెడ్డం పెంచుకుని, ఒక స్థాయిలో షాక్ ఇచ్చాడంతే. అయితే ఈ లుక్‌కు కారణం ఏంటంటే మనోడికి ఏదో కిడ్నీ సమస్య ఉందంటూ ఒక తెలుగు వెబ్ పోర్టల్ చాలా రూమర్లే సృష్టించింది. అందులో నిజమెంత?

ఫైనల్‌గా ఇదే విషయంపై నోరు విప్పాడు రానా. ప్రముఖ ఫిలిం క్రిటిక్ అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్యూలో రానా మాట్లాడుతూ, తన కొత్త సినిమా హాతీ మేరీ సాతీలో ఒక ముప్పై సంవత్సరాలపాటు కేవలం అడివిలోనే గడిపిన వ్యక్తి పాత్రను పోషిస్తున్నానని, దానికోసం ఇంత సన్నబడాల్సి వచ్చిందని, ఒక్కసారి ఆ సినిమా షూటింగ్ అంతా పూర్తవ్వగానే మళ్ళీ కండలు పట్టేస్తానని చెప్పాడు రానా. అతను చెప్పిన తీరు చూస్తుంటే, నిజంగానే అతను పాత్ర కోసమే ఈజీగా తగ్గాడని అనిపిస్తోంది కాని హెల్త్ ప్రాబ్లమ్ ఏదో ఉన్నట్లు అనిపించట్లేదులే.

ఇక ప్రస్తుతం రానా ఇదే లుక్కులో తెలుగులో విరాట పర్వం 1992 అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఏకంగా సాయి పల్లవితో రొమాన్స్ చేస్తున్నాడు. మొత్తానికి తన లుక్ అనేది కేవలం సినిమా కోసం చేసిందే తప్పించి అందులో ఎలాంటి ఇష్యూ లేదని నేషనల్ వైడ్‌గా అలా క్లారిఫికేషన్ ఇచ్చాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English