ముగ్గురు హీరోలకు కాజలే హీరోయిన్

ముగ్గురు హీరోలకు కాజలే హీరోయిన్

జెఫ్రీ గీ చిన్ అనే హాంగ్‌కాంగ్ దర్శకుడు ఇప్పుడు ఒక హాలీవుడ్ సినిమాను రూపొందిస్తున్నాడు. అందులో మంచు విష్ణు మరియు కాజల్ అగర్వాల్ లీడింగ్ పెయిర్ అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో మరో కొత్త న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అసలు సినిమాలే లేవని బాధపడుతున్న కాజల్‌కు ఇప్పుడు ఇది మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అయిపోయేలా ఉంది.

ఈ సినిమాను తెలుగు వర్షన్‌లో మంచు విష్ణు హీరో అయితే, హిందీలో వేరే హీరో అలాగే హాలీవుడ్ కోసం మరో హీరో నటిస్తారట. కాకపోతే ముగ్గురు హీరోలు మారినప్పటికీ, మూడు బాషల్లోనూ కాజలే హీరోయిన్‌గా చేయనుంది. బంధాలు అనుబంధాలు అంటూ సాగే ఈ కథలో కాజల్ ఒక్కత్తే హీరోయిన్ కాదట. మరో హాలీవుడ్ స్టార్లెట్ మెయిన్‌గా హీరోయిన్‌గా కనిపిస్తుందట. అయితే సదరు ఒక ఇండియన్ అమ్మాయితో పెట్టుకునే ఒక ఎఫైర్ ఎపిసోడ్‌లో కాజల్ హీరోయిన్‌గా దర్శనం ఇవ్వనుంది ఒక ముంబయ్ పత్రిక కథనం ప్రచురించింది.

ఏదేమైనా కూడా కవచం, సీత వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తరువాత కాజల్‌కు ఏ బాషలోనూ సినిమాలే లేవే అనుకుంటున్న వేళ, ఖచ్చితంగా ఈ హాలీవుడ్ ఆఫర్ మాత్రం ఖాళీ గ్లాసులో కోకాకోలా పోసినట్లుంది. చూద్దాం కాజల్ ఎంతవరకు వాడుకుంటుందో. జూలై 15 నుండి ఈ హాలీవుడ్ సినిమా షూటింగ్ మొదలవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English