మన్మథుడికి ఆవిడే తలపోటు!

మన్మథుడికి ఆవిడే తలపోటు!

మన్మథుడు 2 టీజర్లు ఆహ్లాదంగా, వినోదాత్మకంగా వున్నాయి. మామూలుగా అయితే ఈ టీజర్లకి మంచి స్పందన వచ్చి సినిమాపై పాజిటివ్‌ వైబ్స్‌ ఏర్పడాలి. కానీ అనుకోని కారణాల వల్ల మన్మథుడు ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. సర్టిఫైడ్‌ ఫెమినిస్టుని అంటూ... ఆడవాళ్ల తరఫున కీ బోర్డ్‌ వార్‌ చేస్తోన్న సింగర్‌ చిన్మయి చిన్నెల వల్ల ఈ చిత్రానికి తలనొప్పులు తప్పడం లేదు. సదరు చిన్మయి భర్తే ఈ చిత్ర దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ కావడంతో చిన్మయి ఏమి మాట్లాడినా కానీ మన్మథుడులో సీన్లు, క్యారెక్టర్లు తీసుకొచ్చి 'ఇది రైటా?' అంటూ ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌ క్లియర్‌గా చిన్మయిని ఇలాంటి విషయాలలో కట్టడి చేయడనేది తెలిసిపోతోంది. కానీ ఆమె పెట్టుకుంటోన్న పేచీలు తన సినిమా పట్ల నెగెటివిటీకి కారణమవుతున్నాయి.

దీనిని జోవియల్‌గా తీసుకోవడానికి, జరుగుతున్న దానిని కామెడీ చేయడానికి రాహుల్‌ బాగా ట్రై చేస్తున్నాడు కానీ అతను ఎంత చేసినా చిన్మయి మాత్రం తన భర్తపై, అతని కెరియర్‌పై కనికరం చూపించడం లేదు. తన పేరు ట్యాగ్‌ చేయని వారిని కూడా వెతుక్కుని మరీ ఉతుకుతోంది. బాలీవుడ్‌లో కంగన పట్ల సోషల్‌ మీడియాలో ఎలాంటి హేట్రెడ్‌ అయితే వుందో చిన్మయికి వ్యతిరేకంగా కూడా అంత మంది తయారవుతున్నారు. ఇదంతా తన సినిమాకి నెగెటివ్‌గా మారుతుందని నాగార్జున వర్రీ అవడంలో తప్పు లేదు. అసలే సోషల్‌ మీడియాలో నెగెటివిటీ స్ప్రెడ్‌ అయితే ఏమి జరుగుతుందనేది దేవదాస్‌ చిత్రానికి ఆయన స్వయంగా ఎక్స్‌పీరియన్స్‌ చేసారు. బిగ్‌ బాస్‌ షో హోస్ట్‌గా నాని తెచ్చుకున్న నెగెటివిటీ ఆ చిత్రం మెడకి చుట్టుకున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English