అఖిల్‌ కథ మళ్ళీ మొదటికి

అఖిల్‌ కథ మళ్ళీ మొదటికి

తొలి మూడు చిత్రాలు ఫ్లాప్‌ అవడంతో అక్కినేని అఖిల్‌ చుట్టూ వుండే క్రేజ్‌ అంతా ఆవిరైపోయింది. అక్కినేని వీరాభిమానులు కూడా ఆల్రెడీ తమ ఆశా దీపం నాగచైతన్యేనని ఫిక్సయిపోయారు. అఖిల్‌ ఫ్లాప్‌ అవుతోంటే, చైతన్య 'మజిలీ'తో మంచి హిట్టు కొట్టాడు కనుక అభిమానులు అటు మొగ్గిపోయారు. ఈసారి అఖిల్‌కి హిట్‌ ఇచ్చే బాధ్యతని అల్లు అరవింద్‌ అండ్‌ కోకి అప్పగించిన నాగార్జున తన సినిమాలతో బిజీ అయిపోయాడు. బొమ్మరిల్లు, పరుగు తర్వాత మళ్లీ అలాంటి సినిమా ఇవ్వలేక దాదాపు కనుమరుగైన భాస్కర్‌ని తీసుకొచ్చి అఖిల్‌ చిత్రానికి దర్శకుడిని చేసారు.

బొమ్మరిల్లు భాస్కర్‌తో సినిమా ఏమిటని అభిమానులు నొచ్చుకున్నా కానీ 'మైనస్‌ ఇంటూ మైనస్‌' ప్లస్‌ అవుతుందిలెమ్మని గమ్మున వున్నారు. ఈ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయాలని చూస్తోన్న నిర్మాత హీరోయిన్‌పై కూడా పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా లేడు. అందుకే సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలు వేస్తోన్న నివేదా పేతురాజ్‌ని ఫైనలైజ్‌ చేసినట్టు చెప్పుకున్నారు. ఈ న్యూస్‌ని ఇంకా ఫాన్స్‌ డైజెస్ట్‌ చేసుకోలేదు. ఈలోగా అఖిల్‌ తిరుమల కాలినడకన వెళ్లి వచ్చేసాడు. నివేదని అయితే ఫైనలైజ్‌ చేయలేదనే న్యూస్‌ బయటకి వచ్చింది. ఎవరైనా కొత్తమ్మాయిని తీసుకోవాలని చూస్తున్నారని మాత్రం సమాచారం అందింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English