హాట్‌: కత్రినా రింగ్‌లోకి దిగితే..!

 హాట్‌: కత్రినా రింగ్‌లోకి దిగితే..!

ఇన్‌స్టాగ్రామ్‌ని తాను ప్రమోట్‌ చేస్తోన్న అండర్‌ వేర్‌ బ్రాండ్‌కి వేదికగా మార్చేసింది దిషా పాట్నీ. కాల్విన్‌ క్లెయిన్‌ అండర్‌వేర్‌తో ఆమె ఇన్‌స్టాలో చేసే రచ్చ ఎలాగుంటుందనేది అందరికీ తెలిసిందే. దీంతో మిగతా బ్రాండ్లు కూడా అదే లెవల్‌ ప్రమోషన్‌ ఆశిస్తున్నాయి. రీబాక్‌ స్పోర్ట్స్‌ వేర్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన కత్రిన ఛాలెంజ్‌ యాక్సెప్ట్‌ చేసింది. దిషా కంటే వయసులో పదేళ్లు పెద్దదయినా కానీ ఆమె ఫిజిక్‌తో పోటీ పడగల శరీరాకృతి కత్రినా సొంతం. అందుకే రీబాక్‌కి మొదలు పెట్టిన ప్రచారంలో కత్రినా రెచ్చిపోతోంది.

కత్రినా కైఫ్‌ లాంటి సుందరి అందాలని ప్రదర్శిస్తే గుడ్లప్పగించని వారెవరుంటారు. ఇప్పటికే కత్రినా బాడీ బాగుందా లేక దిషా బాడీనా అంటూ పోల్స్‌ కూడా రన్‌ అవుతున్నాయి. ఇన్నాళ్లూ పోటీ లేకుండా తన అండర్‌వేర్‌ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేసుకున్న దిషా ఇకపై కాస్త ఇన్నోవేటివ్‌గా, ఇంకాస్త హాట్‌గా ఫోటోలకి ఫోజులివ్వాలి మరి. ఎందుకంటే అటువైపు రంగంలోకి దిగింది 'కత్తి'రినా కైఫుగా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English