నిహారిక కొణిదెల గుడ్‌ బై?

 నిహారిక కొణిదెల గుడ్‌ బై?

మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న కుర్రాళ్లలో చాలా మందికి ప్రేక్షకుల అండ, అభిమానుల ఆశీస్సులు లభిస్తున్నాయి. అయితే మెగా కుటుంబం నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్‌ నీహారిక కొణిదెలకి మాత్రం ఫాన్స్‌ సపోర్ట్‌ దక్కలేదు. నటిగా అదృష్టం పరీక్షించుకోవాలనే ఆమె కోరికకి నాగబాబు అడ్డు చెప్పలేదు. అన్నయ్య వరుణ్‌ తేజ్‌ కూడా తనని ఎంకరేజ్‌ చేసాడు. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ కూడా ఆమె చిత్రాల వేడుకలకి వచ్చి ప్రమోట్‌ చేసారు. అయితే నీహారికకి సరయిన కథలు దొరకలేదు.

అందులోను పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తోన్న అమ్మాయిపై వుండే ఆంక్షల వల్ల ఆమెకి పెద్ద సినిమాలలో అవకాశాలు కూడా రాలేదు. నాలుగైదు సినిమాలలో నటించినా కానీ అదృష్టం వరించకపోవడంతో, ఒక్క విజయం కూడా తన పేరిట నమోదు కాకపోవడంతో ఇక సినిమాలు చేయకూడదని నీహారిక నిర్ణయించుకుందట. ఇదే విషయాన్ని తన తండ్రికి కూడా చెప్పేసిందని, అయితే వెబ్‌ సిరీస్‌లు మంచివి వస్తే మాత్రం చేయాలని డిసైడ్‌ అయిందట.

హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయిన నీహారిక సపోర్టింగ్‌ రోల్స్‌తో తిరిగి ఎంట్రీ ఇస్తుందో లేక వెండితెరతో సంబంధాలు తెంచేసుకుని పెళ్లి సంబంధాలు వెతకడానికి తల్లిదండ్రులకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తుందో తెలియదు కానీ మరోసారి తెలుగు చిత్ర సీమలో అబ్బాయిలకి వుండే ఆదరణ అమ్మాయిలకి దక్కదని మాత్రం రుజువయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English