మన డైరెక్టర్.. ఆల్ఇండియా ట్రెండింగ్

మన డైరెక్టర్.. ఆల్ఇండియా ట్రెండింగ్

‘కబీర్ సింగ్’ రిలీజైన నాటి నుంచి దేశవ్యాప్తంగా సినీ వర్గాల చర్చల్లో ‘సందీప్ రెడ్డి వంగ’ అనే పేరు ఉంటోంది. క్రిటిక్స్ చీల్చి చెండాడిన అతడి సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపి సందీప్ పేరు మార్మోగేలా చేసింది. విడుదలకు ముందు, తర్వాత విమర్శకులపై సందీప్ చేసిన వ్యాఖ్యలు మరింతగా అతడిని వార్తల్లో నిలబెట్టాయి.

తాజాగా అతను ఒక ఇంటర్వ్యూలో భాగంగా ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ప్రేమ ఉండదని నా అభిప్రాయం’  అంటూ చేసిన కామెంట్లు దుమారం రేపాయి.  సినిమాలో కథానాయిక మీద హీరో చేయి చేసుకోవడాన్ని ఫెమినిస్టులు తప్పుబడుతున్న నేపథ్యంలో సందీప్ ఇలా స్పందించాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. చాలామంది సెలబ్రెటీ లేడీస్ సామాజిక మాధ్యమాల్లో సందీప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

ఈ గొడవ ఇలా ఉంటే.. విషయం ఏదైనా సరే మీమ్స్ చేయడానికి ఛాన్స్ దొరికితే చెలరేగిపోయే బ్యాచ్‌లు సోషల్ మీడియాలో చాలానే ఉంటాయి. అలాంటి వాళ్లకు సందీప్ మంచి కంటెంట్ ఇచ్చేశాడు. సినిమాల్లో హీరోయిన్ని హీరో కొట్టే సన్నివేశాలన్నీ తీసి మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా హీరోయిన్లు హీరోలను కొడుతున్న దృశ్యాలతోనూ మీమ్స్ తయారవుతున్నాయి.

ఎప్పుడో రాజ్ కపూర్ తన సినిమాలో హీరోయిన్ని కొడితే..  సందీప్ రెడ్డి వెర్షన్ ఆఫ్ రాజ్ కపూర్ మూవీ అంటూ ఒక మీమ్ తయారు చేశారు. ఒక పాకిస్థాన్ మూవీలో హీరోయిన్.. హీరోను కొట్టిన సీన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటి మీద ఫన్నీ కామెంట్లతో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. మొత్తానికి ‘కబీర్ సింగ్’ సినిమాతో, తన కామెంట్లతో ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయాడు సందీప్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English