ఆమె హీరోయిన్ అంటే జనాలు పట్టించుకుంటారా?

 ఆమె హీరోయిన్ అంటే జనాలు పట్టించుకుంటారా?


తెలుగులో కొన్నేళ్ల కిందట చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం ‘రాజు గారి గది’. పెట్టుబడి మీద ఐదారు రెట్ల ఆదాయం తెచ్చిపెట్టిందీ చిత్రం అప్పట్లో. ఈ విజయం చూసి షాకైంది టాలీవుడ్. అక్కినేని నాగార్జున అంతటి వాడు కూడా ఇంప్రెస్ అయి.. దీని సీక్వెల్‌లో నటించడానికి ముందుకు వచ్చాడు. కానీ ఓంకార్ ఈసారి ఆశించిన ఔట్ పుట్ ఇవ్వలేదు.

మంచి కాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ యాడ్ అయినా ‘రాజు గారి గది-2’ మ్యాజిక్ చేయలేకపోయింది. దీంతో ఓంకార్ కెరీర్లో గ్యాప్ వచ్చేసింది. అయినా అతనేమీ ‘రాజు గారి గది’ సిరీస్‌ను ఆపేయలేదు. తమన్నా ప్రధాన పాత్రలో కొన్ని రోజుల కిందటే మూడో పార్ట్ మొదలుపెట్టాడు. కానీ ఆ చిత్రానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తమన్నా తప్పుకోవడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది.

ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్, తాప్సిల పేర్లు వినిపించాయి కానీ.. వాళ్లిద్దరితో సినిమా వర్కవుట్ కాదని తేలిపోయింది. చివరికి ఇప్పుడు ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ అవికా గోర్‌ను ‘రాజు గారి గది-3’ ప్రధాన పాత్రకు తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. కానీ ఫేస్ వాల్యూ ఏమీ లేని అవికాతో ఇలాంటి సినిమా చేయడం సాహసమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగులో అవికాది షార్ట్ కెరీర్. ఆ షార్ట్ కెరీర్లో ఆమెకు ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి హిట్లున్నాయి. అయినా ఆమెకేమీ క్రేజ్ రాలేదు. దీంతో కెరీర్ ముందుకు సాగలేదు. మధ్యలో షేపవుట్ కావడం కూడా చేటు చేసింది.

ఇప్పుడు బరువు తగ్గినా కూడా ఆమెలో ఏమీ పెద్ద ఆకర్షణ లేదు. తమన్నా నటించాల్సిన సినిమాలో అవికా హీరోయిన్‌ అంటే వినడానికే ఏదోలా ఉంది. అసలే నెగెటివిటీ మధ్య మొదలైన ఈ చిత్రంలో అవిక లాంటి హీరోయిన్ నటిస్తే జనాలు దీని పట్ల ఆసక్తి ప్రదర్శించడం సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English