నయన్ సినిమాకు సమంత సీక్వెల్?

నయన్ సినిమాకు సమంత సీక్వెల్?

ప్రస్తుతం దక్షిణాదిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఫస్ట్ ఛాయిస్‌గా కనిపిస్తున్న కథానాయిక నయనతార. ఆమె హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించి.. తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో తిరుగులేని విజయాలనందుకుంది నయన్. ఆమె లీడ్ రోల్ చేసిన సినిమాల్లో చాలా పెద్ద విజయాన్నందుకున్న చిత్రం ‘అరామ్’.

గోపి నైనార్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం రెండేళ్ల కిందట విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. అందులో నయన్ కలెక్ట్ పాత్రలో నటించింది. బోరు బావిలో పడ్డ ఒక పేద పిల్ల ప్రాణాన్ని కాపాడటానికి కలెక్టర్ ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. దీనికి సీక్వెల్ తీయాలని చూస్తున్నాడు గోపీ నైనార్. కానీ నయన్ ఇందులో నటించే అవకాశాలు కనిపించడం లేదు.

అంతకంతకూ డిమాండ్ పెంచుకుంటున్న నయన్.. ఇప్పుడు ఆల్రెడీ మూడు నాలుగు కమిట్మెంట్లతో బిజీగా ఉంది. అవన్నీ కూడా భారీ సినిమాలే. ‘అరామ్-2’కు డేట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మరి నయన్ కోసం ఎక్కువ కాలం ఆగాలనుకోవడం లేదో ఏమో.. గోపీ సీక్వెల్ వేరే కథానాయిక వైపు చూస్తున్నాడట. ఆ హీరోయిన్ సమంతే అని సమాచారం.

నయన్, అనుష్కల తర్వాత దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయిక సమంత. ‘ఓ బేబీ’తో మంచి విజయాన్ని కూడా ఖాతాలో వేసుకుంటోంది. సినిమాను తన భుజాల మీద మోయగలనని ఈ చిత్రంతో ఆమె రుజువు చేసుకుంది. ఐతే ‘అరామ్’ లాంటి సీరియస్ సినిమా సీక్వెల్లో ఆమె ఏమాత్రం సెట్టవుతుందన్నది సందేహం. కామెడీ అయితే సామ్ అదరగొట్టేస్తుంది. ఆమెను జనాలు సీరియస్ పాత్రల్లో చూడటాన్ని ఇష్టపడరేమో అన్న సందేహాలు రేకెత్తించింది ‘యు టర్న్’. మరి ‘అరామ్-2’తో ఆ అభిప్రాయాన్ని సామ్ మారుస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English