సమంత హీరోయిన్ కాదు.. హీరో

సమంత హీరోయిన్ కాదు.. హీరో

హీరోయిన్లకు హీరోల్లాంటి ఇమేజ్ రావడం అరుదుగా జరుగుతుంటుంది. తెలుగులో విజయశాంతి తర్వాత అలాంటి ఇమేజ్ అనుష్కకు మాత్రమే వచ్చింది. తమిళంలో అలాంటి స్టార్ పవర్ సొంతం చేసుకున్నది నయనతార మాత్రమే. వీళ్లిద్దరూ కాకుండా దక్షిణాదిన తనకంటూ ఒక ఇమేజ్, మార్కెట్ సంపాదించుకున్న నాయిక సమంతే. తెరపై ఒక హీరోయిన్ కనిపిస్తే హీరోల్ని చూసిన స్థాయిలో జనాలు కేరింతలు కొట్టడం అందరి విషయంలోనూ జరగదు. ఇలాంటి ఫాలోయింగ్ సంపాదించిన అరుదైన కథానాయికల్లో సమంత ఒకరు. ఈ వేసవిలో విడుదలైన ‘మజిలీ’ సినిమాలో సమంత తెరపై కనిపించడానికి చాలా సమయం పడుతుంది. ఇంటర్వెల్ సమయానికి కానీ ఆమె ఎంట్రీ ఇవ్వదు. కానీ లేటుగా అయినా లేటెస్ట్‌గా ఉండే సామ్ ఎంట్రీకి థియేటర్లు హోరెత్తిపోయాయి. ఆ చిత్రంలో నాగచైతన్యను చూసినప్పటి కంటే సమంతను చూసినపుడు జనాల్లో ఎక్కువ స్పందన కనిపించిందంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు ‘ఓ బేబీ’లోనూ సమంత ఎంట్రీ సీన్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ‘ఓ బేబీ’లో సామ్ ఎంట్రీ సినిమా మొదలైన అరగంటకు కానీ ఉండదు. అప్పటిదాకా అంతగా ఆసక్తి రేకెత్తించని, నత్తనడక సన్నివేశాలతో ‘ఓ బేబీ’ మామూలుగా అనిపిస్తుంది. ప్రేక్షకులకు కొంత నీరసం వచ్చేస్తున్న సమంత బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇస్తుంది. ఆ సమయంలో థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చిన రేంజిలో సామ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుండటం విశేషమే. ‘యు టర్న్’తో తొలిసారి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసిన సామ్‌కు కమర్షియల్‌గా ఆశించిన ఫలితం దక్కలేదు. కానీ ‘ఓ బేబీ’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకునేలా ఉంది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అంచనాల్ని మించే వచ్చేలా ఉన్నాయి. సమంత స్టార్ పవర్ ఏంటో ఈ సినిమాతో అందరికీ బాగానే తెలిసొచ్చేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English