సమంత మనసులో మాట చైతూకు తెలియదా?

సమంత మనసులో మాట చైతూకు తెలియదా?

ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద పెద్ద హీరోలు, దర్శకులతో సినిమాలు చేసింది సమంత. నయనతార తర్వాత ఈ తరం హీరోయిన్లలో తిరుగులేని ఇమేజ్ ఉన్నది సమంతకే. టాప్ డైరెక్టర్లు సైతం సమంతను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఆమె చాలామందికి ఫేవరెట్. అయితే సమంతకు కూడా అభిరుచులు ఉంటాయి. ఫలానా హీరోతో జత కట్టాలి.. ఫలానా దర్శకుడి సినిమాలో చేయాలన్న కోరికలు ఉంటాయి. అయితే ఆల్రెడీ పెళ్లయి లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు అడుగులేస్తోంది కాబట్టి ఇక హీరోల గురించి ఆలోచించేదేమీ లేదు. దర్శకుల సంగతే చూడాలి. ప్రస్తుతానికి ఆమె తప్పక సినిమాలు చేయాలని కోరుకుంటున్న దర్శకులు ఇద్దరున్నారట. అందులో ఒకరు శేఖర్ కమ్ముల కాగా.. మరొకరు మణిరత్నం.

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నటీనటులు అడిగితే ఛాన్సులివ్వడు. ఎవరినైనా ఆయన ఎంచుకోవాల్సిందే. ఆయన చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్న నేపథ్యంలో సమంతకు అవకాశమిస్తాడో లేదో చెప్పలేం. కానీ శేఖర్‌తో సినిమా చేయడమైతే సమంతకు అంత కష్టమేమీ కాదు. ఆమె కాస్త ప్రయత్నిస్తే ఈపాటికే కమ్ములతో సినిమాలో భాగమయ్యేదేమో. సామ్ భర్త ప్రస్తుతం కమ్ముల దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నాడు. అతడికి కూడా ఆ దర్శకుడితో చేయాలని దీర్ఘ కాలంగా కోరిక అట. అది ఎట్టకేలకు నెరవేరిందంటూ సినిమా అనౌన్స్ చేసినపుడు సంతోషం ప్రకటించాడు. మరి కమ్ములతో చేయడం సమంతకు కూడా కల అయినట్లయితే.. అప్పుడే రికమండ్ చేస్తే కమ్ముల ఓకే చెప్పేవాడేమో. అయినా సమంత మనసులో మాట చైతూకు తెలియకుండా ఉంటుందా? ‘ఫిదా’తో ఫిదా చేసిన సాయిపల్లవినే తన తర్వాతి సినిమాకు పెట్టుకోవాలని కమ్ముల అనుకుని ఉండొచ్చు కానీ.. చైతూ, సామ్ అడిగితే మాత్రం కాదనేవాడు కాదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English