హిందీలోనూ అదే టైటిల్.. రిలీజ్ డేట్ ఫిక్స్

హిందీలోనూ అదే టైటిల్.. రిలీజ్ డేట్ ఫిక్స్

కెరీర్లో రెండో సినిమాతోనే తెలుగు సినిమా చరిత్రలో ఒక పేజీని తన సొంతం చేసుకున్నాడు యువ దర్శకుడు దేవా కట్టా. ‘వెన్నెల’ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తర్వాత అతడి నుంచి వచ్చిన ‘ప్రస్థానం’ ఏ స్థాయిలో ప్రశంసలు అందుకుందో తెలిసిందే. టాలీవుడ్లో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఇదొకటిగా పేరు తెచ్చుకుంది.

కమర్షియల్‌గా ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా.. కల్ట్ స్టేటస్ మాత్రం అందుకుంది. దీని తర్వాత అంచనాల్ని అందుకోలేకపోయాడు దేవా. కొన్నేళ్ల పాటు దర్శకత్వానికే దూరమైన దేవా.. ఇప్పుడు మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ‘ప్రస్థానం’ రీమేక్‌తోనే వస్తున్నాడు. ఈ చిత్రాన్ని హిందీలో సంజయ్ దత్ హీరోగా పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దేవానే దర్శకుడు కూడా. తాజాగా ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

‘ప్రస్థానం’ హిందీ వెర్షన్‌కు కూడా అదే పేరు పెట్టడం విశేషం. ముందుగా ఒక సింహాసనాన్ని చూపించి.. తర్వాత దాని కింద గన్ ఉన్నట్లుగా చూపించి సంజయ్ దత్ వాయిస్ ఓవర్‌తో ఈ మోషన్ పోస్టర్ రూపొందించారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబరు 20న రిలీజ్ చేయబోతున్నట్లు కూడా వెల్లడించారు. సంజయ్ దత్ సొంత ప్రొడక్షన్లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. అతడి భార్య మాన్విత నిర్మాత. తెలుగులో సాయికుమార్ పోషించిన కీలక పాత్రను హిందీలో జాకీష్రాఫ్ చేయబోతున్నాడు.

ఐతే యువకుడిగా శర్వానంద్ బాగా సెట్ అయిన పాత్రకు హిందీ పెద్ద వయస్కుడైన సంజయ్ దత్ ఏమాత్రం సూటవుతాడో అన్న సందేహాలున్నాయి. మరి దేవా ఎలా డీల్ చేశాడో చూడాలి. ఈ సినిమా హిట్టయితే దేవా కెరీర్ మళ్లీ గాడిన పడ్డట్లే. దీని తర్వాత తెలుగులో సాయిధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా తీయాలని చూస్తున్నాడు దేవా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English