బ్రేకింగ్ - శంషాబాద్ లో ‘గరుడ‘ శివాజీ

బ్రేకింగ్ - శంషాబాద్ లో ‘గరుడ‘ శివాజీ

నటుడు, ప్రత్యేక హోదా ఉద్యమకారుడు శివాజీని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అలంద మీడియా పెట్టిన కేసులో శివాజీ కోసం వెదుకుతున్న పోలీసులకు ఈరోజు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శివాజీ దొరికారు. అక్కడి నుంచి ఆయనను సైబరాబాద్ క్రైమ్ పీఎస్‌కు తరలించారు. టీవీ9 వాటాల విషయంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, హీరో శివాజీ ఇద్దరిపై అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంతకాలం అజ్జాతంలో ఉన్న రవి ప్రకాష్ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసుల విచారణకు హాజరయ్యారు. కానీ శివాజీ మాత్రం హాజరుకాలేదు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు.

రవి ప్రకాష్ తో పాటు శివాజీకి పలు నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోలేదు. గతంలో ఒక వీడియో విడుదల చేసిన శివాజీ ’వడదెబ్బ వల్ల బయటకు రాలేదని, త్వరలో వస్తానని, తనపై పెట్టిన కేసు చాలా చిన్నది‘ అందులో పేర్కొన్నారు. తనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ శివాజీని హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేదు. శివాజీ దేశం దాటిపోతుంటే పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారట.  శివాజీని అరెస్ట్ చేయడం లేదని, కోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారణకు సహకరించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. నోటీసులు ఆధారంగా శివాజీని విచారిస్తామని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English