బన్నీ ఓకే... కానీ పూరీ జగన్నాథే!

బన్నీ ఓకే... కానీ పూరీ జగన్నాథే!

పూరి జగన్నాథ్‌ ఈమధ్య కాలంలో చాలా చాలా నాసి రకం సినిమాలు తీశాడు. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ వంటి సినిమాలతో డిజప్పాయింట్‌ చేసిన పూరి జగన్నాథ్‌ తాజా చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో’పై ఎవరికైనా అనుమానం ఉందీ అంటే పూరి జగన్నాథ్‌ రీసెంట్‌ ఫామ్‌ వల్లే. ఈ కారణంగా ప్రధానంగా ఓవర్సీస్‌లో ఇద్దరమ్మాయిలతో బిజినెస్‌ ఎఫెక్ట్‌ అవుతుందేమోననే చింత అక్కడి బయ్యర్లకి ఉంది. ఎందుకంటే హీరోతో పాటు దర్శకుడు కూడా అక్కడ జనాన్ని రాబట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు.

పూరి సినిమా అంటే టాక్‌ తెలుసుకుని చూద్దామనే ఫీలింగ్‌ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ‘ఇద్దరమ్మాయిలతో’ ఓపెనింగ్స్‌ ఎలా ఉంటాయోననే అనుమానాలు అయితే బాగా ఉన్నాయి. జులాయితో అల్లు అర్జున్‌ అక్కడ బ్రహ్మాండమైన వసూళ్లు సాధించాడు. అయితే అది త్రివిక్రమ్‌ క్రెడిట్‌ అనేది జగద్విదితం. ఈమధ్య మహేష్‌, పవన్‌లతో తీసిన చిత్రాలతో కూడా ఓవర్సీస్‌ బయ్యర్లకి నష్టాలు తెచ్చిపెట్టిన పూరి ఈ సినిమాతో అయినా తిరిగి తన పూర్వ వైభవం సాధించుకుని ఎన్నారైల నమ్మకాన్ని చూరగొంటాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు