నానిని ఫాలో అవుతున్న విజయ్‌ దేవరకొండ

నానిని ఫాలో అవుతున్న విజయ్‌ దేవరకొండ

నాని నటించిన 'ఎవడే సుబ్రమణ్యం'తో పరిచయం అయిన విజయ్‌ దేవరకొండ కొద్ది రోజుల్లోనే నానితో సమానమైన మార్కెట్‌ని తెచ్చుకున్నాడు. గీత గోవిందంతో నాని కంటే పెద్ద విజయాన్ని కూడా అందుకున్నాడు. అయితే కొన్ని విషయాలలో మాత్రం దేవరకొండ తన మొదటి హీరో నానినే ఫాలో అవుతున్నాడు. మార్కెట్‌ ఎంత పెరిగినా కానీ నాని తన చిత్రాల బడ్జెట్‌ పెరగకుండా చూసుకుంటాడు. సబ్జెక్ట్‌కి అనుగుణంగా ఖర్చు పెట్టించడమే కాకుండా బయ్యర్లకి కూడా అందుబాటు ధరల్లో తన సినిమా వుండేలా జాగ్రత్త పడతాడు. దీని వల్లే నాని మార్కెట్‌ స్టెబులైజ్‌ అయి ఈరోజు సక్సెస్‌ఫుల్‌ స్టార్‌ అయ్యాడు.

విజయ్‌ దేవరకొండకి కూడా నలభై కోట్లు పెట్టడానికి నిర్మాతలు, బయ్యర్లు వెనకాడరు. కానీ తన సినిమాలని పాతిక కోట్ల రేంజ్‌లోనే వుంచడానికి అతను ఇష్టపడుతున్నాడు. దీని వల్ల సినిమా మిస్‌ఫైర్‌ అయినా నష్టాలు పెద్దగా వుండవని, బయ్యర్లకి తనపై నమ్మకం సడలదని అతను నమ్ముతున్నాడు. బడ్జెట్‌ దగ్గర్నుంచి బిజినెస్‌ వరకు అన్ని విషయాలలోను విజయ్‌ దేవరకొండ కూడా ఇన్‌వాల్వ్‌ అయి తనకున్న పేరు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నాడు. నాని తప్ప ఇలా మరెవరూ ఇలాంటి విషయాలని పట్టించుకోరు. ఈ విషయంలో కూడా నానికి తన 'రిషి' పోటీగా మారాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English