నిఖిల్‌ బ్యాడ్‌టైమ్‌.. మరో సినిమా ఆగింది

నిఖిల్‌ బ్యాడ్‌టైమ్‌.. మరో సినిమా ఆగింది

నిఖిల్‌ నటించిన 'అర్జున్‌ సురవరం' ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో తెలియని అనిశ్చితి కొనసాగుతోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్‌ డేట్స్‌ ప్రకటించడం కూడా మానేసింది. ఈ చిత్రం విడుదలయిందో లేదో కూడా తెలియని అయోమయం వికీపీడియా కూడా కలిగిస్తోంది. ఒక ప్రముఖ నటుడు నటించిన చిత్రం ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవడం బాధాకరం. ఈ చిత్రాన్ని నిఖిల్‌ డిస్‌ఓన్‌ చేసేసుకుని వేరే చిత్రాలపై దృష్టి పెట్టేసాడు. అర్జున్‌ సురవరంతో తనకేం సంబంధం లేదని తన సన్నిహితులతో చెబుతున్నట్టు కూడా ఇండస్ట్రీలో చెబుతున్నారు.

ఇలాంటి కష్ట కాలంలో నిఖిల్‌ నెత్తిన మరో బండ పడింది. అతను ఇటీవల మొదలు పెట్టిన 'శ్వాస' చిత్రం షూటింగ్‌ కూడా నిలిచిపోయింది. ఈ చిత్రం అనుకున్న రీతిన రావడం లేదని షూటింగ్‌ ఆపేసారనే టాక్‌ వినిపిస్తోంది. వరుస పరాజయాలతో ఒత్తిడి ఎదుర్కొంటున్న నిఖిల్‌ ప్రస్తుతం మరో ఫ్లాప్‌ని ఫేస్‌ చేసే సిట్యువేషన్‌లో లేడు. అర్జున్‌ సురవరం రిలీజ్‌ ఆగిపోవడం ఇప్పటికే అతడి మార్కెట్‌ని చాలా ఎఫెక్ట్‌ చేసింది. దీంతో తదుపరి రాబోయే చిత్రం ఖచ్చితంగా గొప్పగా వుండాలని భావిస్తున్నాడు. అందుకే శ్వాస పక్కన పడేసి కార్తికేయ 2పై ఫోకస్‌ పెట్టినట్టున్నాడు. అయితే కార్తికేయ 2కి బడ్జెట్‌ సమస్యలున్నాయనే గుసగుసలు కూడా ఇండస్ట్రీలో వున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English