రీమేక్ క్రెడిట్.. ఆమె ఫుల్ క్లారిటీతో ఉంది

రీమేక్ క్రెడిట్.. ఆమె ఫుల్ క్లారిటీతో ఉంది

రీమేక్ సినిమాలు చేయడం వల్ల దర్శకులు పేరు రావడం అరుదు. ‘గబ్బర్ సింగ్’ తరహా కొన్ని సినిమాల్ని మినహాయిస్తే రీమేక్‌ల ద్వారా దర్శకులు క్రెడిట్ రావడం అరుదు. ఒకవేళ రీమేక్ కనుక ఆడితే.. అది ఒరిజినల్‌లోని గొప్పదనం అంటారు. సినిమా తేడా కొడితే మాతృకను చెడగొట్టారు అంటారు. ఈ సంగతి తెలిసే తాను కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ని రీమేక్ చేయడానికి రెడీ అయ్యానని అంటోంది నందిని రెడ్డి.

‘కళ్యాణ వైభోగమే’ తర్వాత మూడేళ్ల పాటు నందిని నుంచి సినిమా లేదు. ఇందులో రెండున్నరేళ్లు ఆమె ఖాళీగానే ఉంది. ఏవేవో ప్రాజెక్టులు అనుకుంటే చివరికి ‘మిస్ గ్రానీ’ని ‘ఓ బేబీ’గా రీమేక్ చేయాల్సి వచ్చింది. ఇప్పటిదాకా రీమేక్ టచ్ చేయని మీరు.. ఈ సినిమా ఎందుకు చేశారు.. రీమేక్ వల్ల కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగం ఉంటుంది అని అడిగితే ఆమె ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.

‘మిస్ గ్రానీ’ సినిమాను తన దగ్గరికి తీసుకొచ్చి రీమేక్ చేయమని అడిగింది సమంతే అని నందిని చెప్పింది. ఐతే సాధారణంగా రీమేక్ తీస్తే దర్శకులకు పెద్దగా పేరు రాదని.. బాగా తీస్తే ‘అక్కడున్నదే తీశారు కదా’ అంటారని.. బాగా తీయకపోతే ‘మంచి కథను పాడు చేశారు’ అంటారని తనకు తెలుసని.. ఐతే రెంటినీ మోయక తప్పదని ఆమె చెప్పింది.

‘మిస్ గ్రానీ’ని ఉన్నదున్నట్లు దించేయలేదని.. 60 శాతమే వాడుకున్నామని.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథను చెప్పామని నందిని చెప్పింది. ముందు ఈ సినిమాను కామెడీ చిత్రంగా ప్రమోట్ చేశామని.. కానీ ప్రివ్యూ ద్వారా ఈ సినిమా చూసిన 200 మంది కన్నీళ్లతో బయటికి వచ్చారని.. దీంతో ఇది కామెడీతో పాటు ఎమోషన్ కూడా ముడిపడ్డ సినిమా అని అందరికీ చెప్పాల్సి వస్తోందని నందిని తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English