సమంత.. అమ్మతో వచ్చిందోచ్

సమంత.. అమ్మతో వచ్చిందోచ్

పెళ్లి కాకముందు సమంతను చిన్మయి, నీరజ కోన లాంటి స్నేహితులతో చూసేవాళ్లం. పెళ్లి తర్వాత నాగచైతన్యతో పాటు అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆమె చుట్టూ కనిపిస్తున్నారు. కానీ సామ్ తన తల్లిదండ్రులతో కనిపించడం మాత్రం అరుదు. గత దశాబ్ద కాలం దాదాపుగా అలాంటి దృశ్యమే జనాలకు కనిపించలేదు.

పెళ్లి సమయంలో సైతం తల్లిదండ్రులతో సమంత ఉన్న ఫొటోలు బయటికి రాలేదు. అప్పుడప్పుడూ ఇంటర్వ్యూల్లో తన తల్లి గురించి మాట్లాడుతుందే తప్ప.. ఆమెతో కలిసి కనిపించడం మాత్రం ఉండదు. ఐతే సమంతను తల్లితో కలిసి ఒక వేడుకలో చూసే అవకాశం ఎట్టకేలకు తెలుగు సినీ ప్రేక్షకులకు దక్కింది. సామ్ కొత్త  సినిమా ‘ఓ బేబీ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆమె తల్లి నిన్నెట్ ప్రభు పాల్గొనడం విశేషం.

‘ఓ బేబీ’ తల్లులు, పెద్ద వాళ్ల గొప్పదనం, తమ జీవితాల్లో వాళ్లు చేసిన త్యాగాల గురించి ప్రస్తావించి.. వాళ్ల కలల్ని నెరవేర్చడం గురించి చర్చించే సినిమా. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా తన తల్లిని గుర్తు చేసుకుని ఆమె పడ్డ కష్టం గురించి చెబుతోంది సామ్. ఈ క్రమంలోనే ‘ఓ బేబీ’ వేడుకకు కూడా తల్లిని తీసుకొచ్చినట్లుంది. సామ్ తల్లి ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా చాలా కామ్‌గా ఉన్నారు. వేదికెక్కి మాట్లాడనూ లేదు.

సామ్ తల్లిదండ్రులిద్దరూ కూడా లైమ్ లైట్లో ఉండటానికి అంతగా ఇష్టపడరు. చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారని వాళ్ల తీరును బట్టే అర్థమవుతుంది. ఏదేమైనా సమంతను ఇలా తల్లితో కలిసి చూడటం ఆమె అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. తన కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా సమంత చెబుతున్న ‘ఓ బేబీ’ జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English