చిరు అడ్డాలో ఓకే.. అక్కడా చూపిస్తాడా సత్తా?

చిరు అడ్డాలో ఓకే.. అక్కడా చూపిస్తాడా సత్తా?

రూ.32 కోట్లు.. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'సైరా నరసింహారెడ్డి' కర్ణాటక థియేట్రికల్ హక్కులు పలికిన రేటు ఇదట. పరాయి రాష్ట్రంలో ఒక తెలుగు సినిమాకు ఇంత ధర పలకడం అనూహ్యం. తెలుగు సినిమా మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. 'బాహుబలి' లాంటి స్పెషల్ ఫిలింకు ఇలా అనూహ్యమైన రేటు పలకడంలో ఆశ్చర్యం లేదు. కానీ 'సైరా'కు కూడా ఆ స్థాయి ధర రావడం ఆశ్చర్యకరమే.

ఐతే కర్ణాటకలో చిరంజీవికి ఎప్పుడూ బలమైన మార్కెట్టే ఉంది. అది ఆయన అడ్డా. రెండు దశాబ్దాల కిందటే చిరు చిత్రాలకు అక్కడ కోట్లల్లో వసూళ్లు వచ్చేవి. మధ్యలో చిరు విరామం తీసుకున్నా.. కర్ణాటకలో మెగా హీరోల మార్కెట్‌ను పెంచుకుంటూ పోయాడు మెగా హీరోలు. 'ఖైదీ నంబర్ 150'తో రీఎంట్రీలో కన్నడ నాట తన పవర్ చూపించాడు చిరు. ఇప్పుడు మెగాస్టార్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న 'సైరా'కు దక్షిణాదిన అంతటా మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో కన్నడ స్టార్ సుదీప్ కీలక పాత్ర చేస్తుండటం కూడా కలిసొచ్చి కర్ణాటకలో భారీ రేటు పలికింది.

విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క ఉన్నారు కాబట్టి తమిళంలో కూడా 'సైరా'కు మంచి బిజినెస్సే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎటొచ్చీ హిందీ మార్కెట్ విషయంలోనే సందేహాలున్నాయి. అమితాబ్ బచ్చన్ నటిస్తున్నప్పటికీ.. ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి ప్రదర్శిస్తారా.. అక్కడ ఆశించిన స్థాయిలో హక్కుల కోసం డిమాండ్ ఉంటుందా.. 'బాహుబలి', '2.0' తరహాలో దీనికి మంచి రేటు వస్తుందా అన్నది డౌటు. చూద్దాం ఏమవుతుందో?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English