మహేష్ కాదు.. సల్మాన్ అట

 మహేష్ కాదు.. సల్మాన్ అట

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో రెండేళ్ల కిందట సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ నుంచి అతడికి పిలుపు వచ్చింది. ఇద్దరి మధ్య డిస్కషన్లు కూడా నడిచాయి. ఐతే ఈలోపు ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో రీమేక్ చేయాల్సి వచ్చింది. ఆ పని పూర్తి చేసేసరికి మహేష్ బాబు అందుబాటులో లేకుండా పోయాడు.

అలాగని సందీప్‌కు ఆఫర్స్ ఏమీ తక్కువగా లేవు. ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్లో అతడి పేరు మార్మోగిపోతోంది. ఈ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇచ్చి, బ్యాడ్ కామెంట్స్ చేసిన విమర్శకులకు పంచ్ ఇస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది ‘కబీర్ సింగ్’. ఇప్పటికే ఈ చిత్ర వసూళ్లు రూ.150 కోట్లు దాటిపోయాయి. దీంతో సందీప్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్లో పెద్ద హీరోలు, నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం సందీప్ దర్శకత్వంలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా సినిమా తెరకెక్కనుందట. సందీప్‌తో ‘కబీర్ సింగ్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన టీ సిరీస్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా తీయబోతోందట. ఆల్రెడీ ఒప్పందాలు కూడా పూర్తయినట్లు సమాచారం. సల్మాన్ ఎక్కువగా ఊర మాస్ సినిమాలే చేస్తుంటాడు కానీ.. అప్పుడప్పుడూ రూటు మార్చి కొత్త తరహా చిత్రాల్లోనూ నటిస్తుంటాడు.

‘భజరంగి భాయిజాన్’, ‘సుల్తాన్’ లాంటి చిత్రాలు అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. సందీప్‌‌తో సినిమా ఇంకా భిన్నంగానే ఉండే అవకాశముంది. సల్మాన్‌తో సినిమా చేసి హిట్టు కొట్టాడంటే ఇక సందీప్‌ను తెలుగు వాళ్లు మరిచిపోవచ్చు. రామ్ గోపాల్ వర్మ తర్వాత బాలీవుడ్లో ఇంత వేగంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీపే కావచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English